మోక్షజ్ఞ అవైటెడ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన భారీ చిత్రం “డాకు మహరాజ్” రిలీజ్ కి వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బాలయ్య, బాబీ కాంబినేషన్ లో ప్లాన్ చేసిన ఈ సినిమాపై ఇపుడు క్రేజీ హైప్ ఉంది. ఇక ఈ సినిమా కాకుండా నందమూరి అభిమానులని ఓ రేంజ్ లో ఎగ్జైట్ చేస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది నటసింహ వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినిమా కోసమే అని చెప్పాలి.

టాలెంటెడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఆమధ్య కొన్ని రూమర్స్ వచ్చాయి కానీ ఇపుడు వీటిపై క్లారిటీ తెలుస్తోంది. దీనితో ఈ సినిమా ఈ రానున్న ఫిబ్రవరి నుంచే సెట్స్ మీదకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. దీనితో నందమూరి అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఎస్ ఎల్ వి సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version