‘ప్రభాస్ – మారుతి’ సినిమా పై కొత్త రూమర్

‘ప్రభాస్ – మారుతి’ సినిమా పై కొత్త రూమర్

Published on Sep 12, 2023 3:00 AM IST

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా గురించి మరో అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా ప్రభాస్ టైప్ ఫక్తు యాక్షన్ డ్రామా కాదు అని.. ఇదొక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే కామెడీ డ్రామా అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ క్యారెక్టర్ పై మరో రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్‌‌ లో కనిపించబోతున్నాడని.. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ప్రభాస్ ఓల్డ్ క్యారెక్టర్ కి ఓ వీక్ నెస్ ఉంటుందని.. ఆ వీక్ నెస్ ఆధారంగా వచ్చే సీక్వెన్సెస్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంటాయని తెలుస్తోంది.

మరి ఈ సినిమాలో మారుతి ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి. సహజంగా మారుతి అంటేనే.. చిన్న చిన్న పాత్రలతోనే ఫుల్ కామెడీని పండిస్తాడు. మరి ప్రభాస్ సినిమాతో ఏ రేంజ్ కామెడీని పండిస్తాడో చూడాలి. ఇక ఈ సినిమా టైటిల్ కోసం ‘రాయల్’, ‘అంబాసిడర్’ అనే టైటిళ్లను పరిశీలిస్తున్నట్లు టాక్. ఐతే, ‘రాయల్’ అనే టైటిల్ పైనే మేకర్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన కామెడీ ట్రాక్ ను సిద్ధం చేశాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు