‘పుష్ప 2’లో అదిరిపోయే సీక్వెన్స్ అదే

‘పుష్ప 2’లో అదిరిపోయే సీక్వెన్స్ అదే

Published on Jun 3, 2024 3:58 PM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న సినిమా పుష్ప 2: ది రూల్. ప్రస్తుతం ఈ సినిమా ఇంటర్వెల్ లో అల్లు అర్జున్ యాక్షన్ పై ఓ అదిరిపోయే అప్ డేట్ వినిపిస్తోంది. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ వేటాడే సింహంలా సిక్స్ ప్యాక్ తో అదిరిపోయే యాక్షన్ తో అదరగొడతాడని.. పైగా అల్లు అర్జున్ పై వచ్చే ఫైట్స్ అన్ని చాలా స్టైలిష్ గా ఉంటాయని తెలుస్తోంది.

మొత్తానికి సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్స్ లో ఈ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్సే హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా ‘పుష్ప 2’ కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఆగస్టు 15న, 2024 లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఇక ప్రస్తుతం ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..’ అంటూ సాగే కపుల్‌ సాంగ్‌ చాలా బాగా ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు