కోలీవుడ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వీటిలో “వెట్టయన్” సినిమా ఈ నెల దసరా కానుకగా రిలీజ్ కి రాబోతుంది. అయితే ఈ చిత్రం తర్వాత లోకేష్ కనగరాజ్ తో రజిని కూలీ సినిమాలో బిజీగా ఉన్నారు. అయితే ఈ గ్యాప్ లో తనపై ఓ షాకింగ్ న్యూస్ ఫాన్స్ ని కంగారు పెట్టింది. రజినీ అస్వస్థతకు గురయ్యారు అని పలు వార్తలు వచ్చాయి.
అయితే దీనిపై మరింత సమాచారం తెలుస్తోంది. రజని అస్వస్థతకు లోనవ్వడం నిజమేనట. అయితే నిన్న రాత్రి రజిని కొంచెం అస్వస్థతకు లోను కాగా చెన్నై అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అయితే ప్రస్తుతం తలైవర్ ఆరోగ్యం నిలకడగానే ఉందట. అలాగే ఆసుపత్రి సిబ్బంది తన ఆరోగ్యంపై ఒక హెల్త్ బులెటిన్ కూడా త్వరలోనే విడుదల చేయనున్నారట. మరి రజినీ మళ్లీ పూర్తి ఆరోగ్యంతో కోలుకుని తిరిగి రావాలని ఆశిద్దాం.