‘సలార్ 2’ పై ఇక ఫుల్ ఫోకస్ ?


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రస్తుతం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మరోవైపు ప్రభాస్ కూడా ముమ్మరంగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. కాగా కల్కి హడావుడి ముగిసాక, ఓ వారం గ్యాప్ తీసుకుని అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ‘సలార్ 2’ కోసం ప్రభాస్ డేట్స్ ఇస్తాడని తెలుస్తోంది. ఆల్ రెడీ ఇప్పటికే సలార్ 2 షూటింగ్ మొదలైంది. పైగా ప్రభాస్ ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేస్తాడని అంటున్నారు.

అన్నట్టు, ఈ పార్ట్ 2 సినిమాకు ‘శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్‌ ను ఖరారు చేశారు. కాగా ఆ మధ్య ‘సలార్ 2’ సినిమా నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ కూడా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పార్ట్-2ని త్వరగా పూర్తి చేసి.. 2025లో రిలీజ్‌ చేస్తామన్నారు. కాగా, పార్ట్-2 సినిమా ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా ఉండనుందని ఆయన తెలిపారు. మొత్తానికి సలార్ 2తో ప్రభాస్ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Exit mobile version