‘శాకుంతలం’లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌ చెప్పిన సమంత

‘శాకుంతలం’లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌ చెప్పిన సమంత

Published on Apr 11, 2023 7:05 AM IST

సమంత, దేవ్ మోహన్ హీరో హీరోయిన్స్ గా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ పౌరాణిక చిత్రం శాకుంతలం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీలో శకుంతలగా సమంత నటించగా దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించారు. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ బాల భరతుడు పాత్రలో నటించింది. అయితే, శాకుంతలం’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సమంత.. ఈ సినిమా గురించి ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడారు. ఈ సినిమా షూట్ సమయంలో తన చేతికి పెట్టుకున్న పువ్వుల మచ్చలు అలానే ఉండేవని, అలాగే తాను ఈ సినిమా కోసం మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పానని సమంత చెప్పుకొచ్చింది.

అలాగే సమంత ఇంకా మాట్లాడుతూ.. సాంగ్‌ లో లెహంగా డ్యాన్స్ ఇబ్బంది పెట్టిందని, కుందేళ్లు కొరికేవని చెప్పుకొచ్చింది. పైనల్‌గా ఈ సినిమాలో తనది ఒరిజినల్ జుట్టు కాదని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను సమంత తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. గుణటీమ్ వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సమంత గెటప్ అద్భుతంగా ఉండబోతోందని తెలుస్తోంది. సమంత నటిస్తున్న మొట్టమొదటి పౌరాణిక చిత్రం కావడంతో ‘శాకుంతలం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు