సందీప్ వంగా తన కొత్త సినిమా ‘యానిమల్’ ని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పాత్రలోని రెండు షేడ్స్ ఉంటాయని.. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో రష్మిక మందన్నా క్యారెక్టర్ చాలా వినూత్నంగా ఉంటుందని తెలుస్తోంది. పైగా దర్శకుడు సందీప్ వంగా ఈ సినిమాలో రెండు మాస్ ట్రాక్ లు యాడ్ చేశారు. మాస్ ఎలివేషన్లను సందీప్ వంగా చాలా బాగా హ్యాండిల్ చేశాడట. పైగా ఈ మాస్ ఎలివేషన్లలో రణబీర్ కపూర్ కూడా అదిరిపోతారని టాక్. మొత్తానికి భారీ యాక్షన్ టచ్ తో ఈ చిత్రం రాబోతున్నాడు.
వాస్తవానికి ఈ సినిమా ఆగస్టు 11, 2023న విడుదల కావాల్సి ఉంది. ఐతే, ఈ రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. డిసెంబర్ 1, 2023న ఈ సినిమాను థియేటర్లలో విడుదల కానుంది. కాగా మనుషుల్లో మారుతున్న స్వభావాల చుట్టూ సాగే కథ ఇది. మనిషి జంతువులా మారితే ? ఈ కోణంలో ఈ ‘యానిమల్’ సాగనుంది. ఈ సినిమాకు సిద్ధార్థ్ గరిమ మాటలు సమకూర్చగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించారు. టీ సిరీస్ భూషణ్ కుమార్, భద్రకాళీ పిక్చర్స్, సినీ స్టూడియోస్ వన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.