మొదలుకానున్న సింగం కాంబినేషన్ !

Published on Jan 18, 2021 9:15 pm IST

తమిళ్ స్టార్ హీరో సూర్య – యాక్షన్ డైరెక్టర్ హరి కాంబినేషన్ అనగానే.. పవర్ ఫుల్ పోలీస్ స్టోరీతో పాటు ఫుల్ యాక్షన్ డ్రామా ఉంటుందని అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. పైగా గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింగం’ ప్రాంఛైజీలోని యాక్షన్ సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. అయితే తాజాగా వీరి కలయికలో మరో సినిమా రాబోతుంది. మార్చి నుండి సినిమా మొదలుకానుందని తెలుస్తోంది. పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే పల్లెటూరి కథను సినిమాగా చేద్దామని హరి ఇప్పటికే ఓ కథను కూడా రెడీ చేశారట.

అయితే, సూర్య ఫ్యాన్స్ మాత్రం గతంలో వీళ్లు చేసిన ‘ఆరు, వేల్’ లాంటి డిఫరెంట్ మూవీ ఏదైనా చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి సూర్య ప్రతి సినిమాలో ఏదోకటి కొత్తగా ట్రై చేస్తూ.. వైవిధ్యమైన కథలనే ఎంచుకుంటూ వస్తున్నాడు. అందుకే సూర్య ఖాతాలో ‘గజినీ’, ‘సెవెన్త్ సెన్స్’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ వంటి డిఫరెంట్ చిత్రాలు ఉన్నాయి. ఇక ఈ క్రేజీ యాక్షన్ కాంబినేషన్ నుండి ఓ కొత్తరకం కథ రావాలని సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More