సంధ్య థియేటర్ ఘటన.. శ్రీతేజ్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్..

సంధ్య థియేటర్ ఘటన.. శ్రీతేజ్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్..

Published on Dec 23, 2024 10:30 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం పుష్ప 2 ది రూల్ రిలీజ్ సమయంలో హైదరాబాద్ ఫేమస్ సింగిల్ స్క్రీన్ థియేటర్ సంధ్య 70ఎంఎం వద్ద అల్లు అర్జున్ రాకతో ఒక్కసారిగా ఏర్పడిన తోక్కిసలాటలో ఓ కుటుంబం ఛిద్రం అయ్యిపోయిన సంగతి తెలిసిందే. అయితే రేవతి అనే మహిళా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోగా తన కొడుకు శ్రీతేజ్ ఆరోజు నుంచి ఇప్పుడు వరకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.

మరి ఈ నేపథ్యంలో పుష్ప 2 మేకర్స్ భారీ మొత్తంలో ఆ కుటుంబానికి ఆర్ధిక సాయాన్ని కూడా అందించగా ఇపుడు శ్రీతేజ్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది. ఇపుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నేడు డిసెంబర్ 23 హెల్త్ బులెటిన్ లో వైద్యులు తెలిపారు. ప్రస్తుతానికి ఆక్సిజన్ వెంటిలేటర్ మీదనే తాను కొనసాగుతూ ఉండగా ఆరోగ్యం కొంచెం కొంచెంగా కుదుటపడుతుందట. దీనితో శ్రీతేజ్ ప్రాణానికి ప్రస్తుతం ప్రమాదం నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు