ఇళయ దళపతి విజయ్ హీరోగా ఇప్పుడు కోలీవుడ్ లో “గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ నుంచి రాజకీయ రంగప్రవేశం ఉంటుంది అని ఈ సినిమా మొదలు పెట్టిన నాటి నుంచే టాక్ ఉంది. అయితే ఇప్పుడు విజయ్ పొలిటికల్ రాకపై లేటెస్ట్ అప్డేట్ తమిళ సినీ వర్గాల నుంచి వినిపిస్తుంది.
దీనితో విజయ్ అయితే ఖచ్చితంగా రాజకీయాల్లోకి రాబోతున్నాడని అలాగే అతి త్వరలో తాను తన పార్టీని రిజిస్టర్ కూడా చేయించబోతున్నాడు అని తెలుస్తుంది. అలాగే విజయ్ తమిళనాట రానున్న 2026 ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాడని ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి విజయ్ భారీ క్రేజ్ ఉన్న విజయ్ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. ఇక “గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ ఏడాదిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.