మెగా యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఎప్పటికప్పుడు కొత్త సబ్జెక్టు లని అందించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గానే “మట్కా” సినిమాలో కూడా పలు వేరియేషన్స్ లో సహా నటుడుగా కూడా మెప్పించాడు. అయితే ఈ సినిమా తర్వాత తన నుంచి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని తాను అనౌన్స్ చేసాడు. ఈసారి ఇండో – కొరియన్ కామెడీ థ్రిల్లర్ ని దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో అలరించేందుకు వస్తున్నాడు.
అయితే ఈ సినిమాపై మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఇపుడు అందించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా యూనిట్ వియాత్నంలో లొకేషన్ వేటలో ఉన్నట్టుగా తెలిపారు. అలాగే ఈ మార్చ్ నుంచి సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేస్తున్నట్టుగా కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.