లేటెస్ట్ : ఆ హీరోయిన్ ని పెళ్లాడనున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం దిల్ రూబా సినిమాతో పాటు 1970వ దశకం నేపథ్యంతో సాగే ఓ పీరియాడిక్ మూవీ కూడా చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు తప్పకుండా మంచి సక్సెస్ సాధించి తన కెరీర్ కి మరింత ప్లస్ అవుతాయని కిరణ్ భావిస్తున్నారు. ఇక మ్యాటర్ ఏమిటంటే, కిరణ్ అబ్బవరం త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. రాజావారు రాణిగారు సినిమాలో హీరోయిన్ గా తనతో కలిసి నటించిన రహస్యను ఆయన పెళ్లి చేసుకోనున్నారు.

హీరోయిన్ రహస్యతో ఈ వారంలో ఆయన నిశ్చితార్థం జరుగనుంది. కిరణ్ అబ్బవరం, రహస్య గత ఐదేళ్లుగా ప్రేమించుకుని, రిలేషన్ షిప్ లో ఉంటున్నారు. ఈ వారమే ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి ఎంగేజ్ మెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా, ప్రైవేట్ గా ఈ ఎంగేజ్ మెంట్ కార్యక్రమం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా వీరిద్దరి నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన తేదీలు, ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Exit mobile version