యంగ్ హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ ‘రాజ్ తరుణ్ ప్రేయసి’ లావణ్య ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికితోడు లావణ్య ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయడం, పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి రక్షించడంతో ఈ వ్యవహారం మొత్తానికి హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ..”నా న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తాను. రాజ్ తరుణ్ నాకు కావాలి. తను లేని ఈ జీవితం నాకు వద్దు. తన కోసమే నేను ఫైట్ చేస్తున్నాను. నేను డిప్రెషన్లో ఉన్నాను అందుకే చనిపోవాలి ప్రయత్నం చేశాను.
ఆమె ఇంకా మాట్లాడుతూ.. ‘మరోవైపు నేను పెట్టిన కేసును వెనక్కి తీసుకోమని తరచూ నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నాకు ప్రాణహాని ఉంది. రాజ్ తరుణ్ మేనేజర్, లాయర్ నాతో మాట్లాడారు. రూ. 5 కోట్లు ఇస్తాము ఈ కేసు రిటర్న్ తీసుకోమని ఆఫర్ చేశారు. నాకు రాజ్ తరుణ్ కావాలి. తను నా దగ్గరికి రాకపోతే, నేను ప్రాణాలతో ఉండను. ఈ కేసు విషయమై నేను ‘మా’ అసోసియేష్కి వెళ్తాను. అవసరమైతే అమరణ నిరాహార దీక్ష చేస్తాను’ అని లావణ్య చెప్పుకొచ్చింది.