ఆన్ స్క్రీన్ పై నువ్వు చాలా అందంగా కనిపిస్తావు. అంటూ ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠికి మన్మధుడు నాగార్జున కాంప్లిమెంట్స్ ఇచ్చారట. ఈ విషయాన్ని సన్నిహితుల వద్ద చెప్పి తెగ సంతోషపడిపోతుంది లావణ్య.
కల్యాణ కృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ కింగ్ నాగార్జున నటిస్తున్న ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలో లావణ్య త్రిపాఠి ఒక హీరోయిన్‌గా నటిస్తుంది. నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ మరొక హీరోయిన్. యంగ్ నాగార్జునతో లావణ్య రొమాన్స్ చేయనుంది.
నేను నాగార్జున సరసన సంప్రదాయబద్దమైన భారతీయ వనితగా నటిస్తున్నాను. మా ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. ఒక్క రోజు షూటింగ్‌లో పోల్గొన్నాను. ఆయనతో నటించడానికి నెర్వస్ గా ఫీల్ అయ్యా. డైలాగ్స్ చెప్పడంలో సహకరించారు. సెట్స్‌లో చాలా సరదాగా ఉంటారు. అని తన అనుభవాలను పంచుకుంది లావణ్య.