విడుదల తేదీ : ఫిబ్రవరి 02, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: లావణ్య త్రిపాఠి, అభిజిత్ దుద్దాల, అభిగ్న వూతలూరు, హర్షవర్ధన్, ఝాన్సీ, మహేష్ విట్టా, హర్ష్ రోషన్ తదితరులు
దర్శకుడు : విశ్వక్ ఖండేరావు
నిర్మాత: సుప్రియ యార్లగడ్డ
సంగీత దర్శకులు: ప్రశాంత్ ఆర్ విహారి
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
సంబంధిత లింక్స్: ట్రైలర్
యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ అభిజీత్ అలాగే యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో దర్శకుడు విశ్వక్ ఖండేరావు తెరకెక్కించిన లేటెస్ట్ సిరీస్ “మిస్ పర్ఫెక్ట్”. మరి డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ తెలుగు సిరీస్ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అయినటువంటి లావణ్య రావు(లావణ్య త్రిపాఠి) కొన్ని పర్సనల్ కారణాల వల్ల ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోతుంది. అయితే అసలే లావణ్యకి కాస్త ఓసిడి ఉంటుంది. మరో పక్క కోవిడ్ 19 సమయంలో తన పని మనిషి జ్యోతి(అభిజ్ఞ వుతలూరు) ఆమె ఉన్న అపార్ట్మెంట్స్ లోనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయినటువంటి రోహిత్(అభిజీత్) కి తాను పనిలోకి రాలేను అనే విషయాన్ని లావణ్యకి చెప్పి అతనికి చెప్పమంటుంది. కానీ ఈ టైం లో లావణ్యను కొత్త పని మనిషిగా రోహిత్ అనుకుంటాడు. అయినా కూడా లావణ్య అలానే కంటిన్యూ అవుతుంది. మరి లావణ్య ఎందుకు అలా కంటిన్యూ అయ్యింది.? అక్కడి నుంచి వారి జర్నీ ఎలా కంటిన్యూ అయ్యింది. అసలు ఈ లావణ్య ఎవరు అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ సిరీస్ చూడాలి.
ప్లస్ పాయింట్స్ :
లావణ్య త్రిపాఠి ఫిల్మోగ్రఫీ చూస్తే ఆమె చేసిన పాత్రల్లో మంచి కామెడీ టైమింగ్ ఉన్న పాత్రలు తక్కువే ఉంటాయి. అయితే ఈ సిరీస్ లో మాత్రం తన కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. అలాగే తనకిచ్చిన డిఫరెంట్ రోల్ ని మంచి ఎంటర్టైనింగ్ గా ప్రెజెంట్ చేస్తూ ఇంప్రెస్ చేసింది.
ఇక చాలా కాలం తర్వాత కెమెరా ముందుకి వచ్చిన అభిజీత్ రోహిత్ అనే పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడని చెప్పాలి. అంతే కాకుండా తన ఈజ్ పెర్ఫామెన్స్ తో ఈ రోల్ ని మాత్రం ఒక కంప్లీట్ ఎంటర్టైనింగ్ గా మార్చాడు. ఇంకా నటి అభిజ్ఞ తన రోల్ నో మంచి హిలేరియస్ గా చేశారు. సిరీస్ లో మంచి ఫన్ ని ఆమె పాత్ర జెనరేట్ చేస్తుంది. ఇంకా మహేష్ విట్టా, హర్షవర్ధన్ తదితరులు తమ రోల్స్ కి న్యాయం చేకూర్చారు.
మైనస్ పాయింట్స్ :
ఈ తరహా సిరీస్ లలో ఆకట్టుకునే కామెడీ ఎంత ఎక్కువ ఉంటే చూసే వీక్షకులకు కూడా ఒక కంప్లీట్ ఫీలింగ్ వస్తుంది కానీ అలాంటి మంచి ఛాన్స్ ఈ సిరీస్ మేకర్స్ మిస్ చేసుకున్నారని చెప్పాలి. చాలా వరకు ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ ని జోడించే స్కోప్ ఉన్నప్పటికీ మేకర్స్ ఎందుకో ఆ ఛాన్స్ తీసుకోలేదు అనిపిస్తుంది.
అదే సిచుయేషనల్ గా మరిన్ని కామెడీ సీన్స్ కానీ యాడ్ చేసి ఉంటే ఇంకాస్త నాచురల్ గా అనిపించేది. ఇక మొదటి కొన్ని ఎపిసోడ్స్ బాగానే ఉన్నా తర్వాత మాత్రం సిరీస్ కథనం చప్పగా అనిపిస్తుంది. మెయిన్ లీడ్ మధ్య ఇంకా ఎంగేజింగ్ నరేషన్ ని పెట్టుంటే బాగుండేది.
అలాగే హర్షవర్ధన్, ఝాన్సీలపై వచ్చే సబ్ ప్లాట్ సిరీస్ లో మరో మైనస్ అని చెప్పాలి. వారి ట్రాక్ ఏమి అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు అలాగే అభిజ్ఞ పాత్రలో ఎమోషన్స్ లోపం క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా సిరీస్ క్లైమాక్స్ పోర్షన్ ని కూడా బెటర్ గా డిజైన్ చేయాల్సింది.
సాంకేతిక వర్గం :
ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు బాగున్నాయి. సిరీస్ వాతావరణంకి తగ్గట్టుగా కనిపించే సెటప్ అంతా నాచురల్ గా ఉంటుంది. ఇక టెక్నికల్ టీం లో ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ బాగుంది. అలాగే ఆదిత్య జవ్వడి విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు.
ఇక దర్శకుడు విశ్వక్ ఖండేరావు విషయానికి వస్తే.. ఈ సిరీస్ కి తాను డీసెంట్ వర్క్ అందించాడు. అయితే రచన అందించిన ఫ్రాన్సిస్ థామస్, శృతి రామచంద్రన్ లలో లోపం ఉంది. వారు సిరీస్ లో ఇంకా ఆకట్టుకునే ఎంటర్టైనింగ్ సీన్స్ ని రాసుకోవాల్సింది. ఉన్న మంచి ఛాన్స్ ని ఇంకాస్త బెటర్ గా మలుచుకోవాల్సింది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ రోమ్ కామ్ సిరీస్ “మిస్ పర్ఫెక్ట్” లో మెయిన్ లీడ్ లావణ్య త్రిపాఠి అలాగే అభిజీత్ లు తమ పాత్రల్లో ఆకట్టుకుంటారు అలాగే అభిజ్ఞ కూడా మంచి ఫన్ ని జెనరేట్ చేస్తుంది. అయితే నెమ్మదిగా సాగే కథనం, ఇంకా కామెడీ ఉండుంటే బాగుంటుంది అనే ఫీల్ తప్పకుండా ఈ సిరీస్ చూస్తున్నపుడు కలుగుతాయి. మరి వీటిని పక్కన పెట్టి ఒక డీసెంట్ ఫ్యామిలీ ఫెండ్లీ సిరీస్ చూడాలి అనుకునేవారు ఈ సిరీస్ ని తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేయవచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team