మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ప్రెస్టీజయస్ పాన్ ఇండియా మూవీ ‘మట్కా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తుండగా పీరియాడిక్ కథగా ఈ సినిమా రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ అయితే మేకర్స్ ఇచ్చారు.
ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘లే లే రాజా’ అనే క్లబ్ బీట్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. రెట్రో తరహా క్లబ్ మిక్స్ సాంగ్‌గా ఇది ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఇక ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి తన అందాల ట్రీట్‌తో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంగీత దర్శకుడు జీవి.ప్రకాశ్ కుమార్ ఆకట్టుకునే మ్యూజిక్‌తో ఈ సాంగ్‌ను కంపోజ్ చేసిన తీరు ఆకట్టుకుంటోంది. ఇక వింటేజ్ స్టెప్స్‌తో నోరా ఈ సాంగ్‌ను మరింత అందంగా మార్చేసింది.
భాస్కరభట్ల చక్కటి లిరిక్స్‌కి నీతిమోహన్ వాయిస్ తోడవడంతో ఈ సాంగ్ ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలుస్తుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ పలు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తుండగా, అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.