విడుదల తేదీ : డిసెంబర్ 19, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : షణ్ముఖ్ జస్వంత్, అనఘా అజిత్, గోపరాజు రమణరాజు, ఆమని, రూప, శరన్, ప్రసాద్ బెహరా తదితరులు.
దర్శకుడు : పవన్ సుంకర
నిర్మాత : సైర్ధర్ మారిస
సంగీత దర్శకుడు : టి ఆర్ కృష్ణ చేతన్
సినిమాటోగ్రఫీ : అనుష్ కుమార్
ఎడిటర్: నరేష్ అదుప
సంబంధిత లింక్స్: ట్రైలర్
మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో లేటెస్ట్ గా వచ్చిన సినిమానే “లీలా వినోదం”. యూట్యూబ్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ నటించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ఇక కథ లోకి వస్తే.. ఈ కథ 2008 సమయంలో సెట్ చెయ్యబడింది కాగా పిఎంఆర్కే ప్రసాద్(షణ్ముఖ్ జస్వంత్) ఓ కాలేజ్ స్టూడెంట్ కాగా తన క్లాస్ మేట్ లీలా(అనఘా అజిత్) అంటే ఇష్టపడతాడు కానీ తన ఇష్టాన్ని ఆమెకి చెప్పలేడు. ఈ నేపథ్యంలో తమ కాలేజీ ముగిసే సమయంలో ఇద్దరూ తమ నంబర్స్ ఒకరిదగ్గర ఒకరు తీసుకుంటారు. అక్కడ నుంచి సరదాగా చాట్ చేసుకుంటారు కూడా.. కానీ ఓ రోజు ఫైనల్ గా తన ఫ్రెండ్ రాజేష్(మిర్చి శరన్) సాయంతో ప్రసాద్ తన ప్రేమని లీలాకి చెప్పేస్తాడు. కానీ ఆ తర్వాత ఆమె నుంచి ప్రసాద్ కి ఒక్క రిప్లై కూడా వెనక్కి రాదు. మరి ఈ సమయంలో అసలు ఆమె ఏమనుకుంటుంది? ఎందుకు సమాధానం ఇవ్వలేదు? ఆమెకి ఏమన్నా అయ్యిందా? అనే చాలా రకాలు ప్రశ్నలు తనని తొలిచేస్తూ ఉంటాయి. మరి అసలు ఆమె ఎందుకు రిప్లై ఇవ్వలేదు, తన ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రంలో నోస్టాలాజిక్ మూమెంట్స్ ని ఎక్కువ ఇష్టపడేవారికి టచ్ అయ్యే మూమెంట్స్ కనెక్ట్ అవుతాయి అని చెప్పొచ్చు. ప్రతీ ఇప్పుడు మిడ్ ఏజ్ లో ఉన్న ప్రతీ ఒక్కరికీ తమ టీన్ ఏజ్ జ్ఞ్యాపకాలు ఒక మధురానుభూతిగా ఉంటాయి. ఆ రోజులు ఎలానో తిరిగి రావు కానీ అప్పటి మూమెంట్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
మరి వాటిని గుర్తు చేసేలా అప్పటి రోజుల్లో పరిస్థితులు కొన్ని మూమెంట్స్ సినిమాలో బాగున్నాయి. అలాగే ఆ టైం లో ఉండే యూత్ వారి ప్రేమ, ఆకర్షణలు తమ లవ్ ని చెప్పేందుకు పడే ఇబ్బంది లాంటి చిన్న చిన్న ఎమోషన్స్ సినిమాలో ఇంప్రెస్ చేస్తాయి. వీటిని షణ్ముఖ్ బ్యూటిఫుల్ గా పండించాడు అని చెప్పాలి.
తన సింపుల్ నటన హావభావాలు ఆ సీన్స్ కి ప్లస్ అయ్యాయి. అలాగే నటి అనఘా కూడా మంచి రోల్ లో కనిపించింది. ఆన్ స్క్రీన్ ఇద్దరి జంట కూడా బాగుంది అని చెప్పాలి. అలాగే మిర్చి శరన్, ప్రసాద్ బెహరా తదితరులు తమ పాత్రల్లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి తమ టైమింగ్ తో ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో లైన్ అందరికీ తెలిసిందే కానీ ఇది అందరికీ కనెక్ట్ అయ్యేది. సో ఇలాంటి వాటికి కథనం ఇంట్రెస్టింగ్ గా రాసుకుంటే దాని ఇంపాక్ట్ ఇంకా బాగుంటుంది. కానీ ఇది ఈ సినిమాలో మిస్ అయ్యింది. చాలా కోట్ల కథనం చాలా నెమ్మదిగా డల్ గా సాగదీతగా అనిపిస్తుంది.
కొన్ని మూమెంట్స్ వరకు ఓకే, అలాగే నిడివి కూడా పెద్దదేం కాకపోయినప్పటికీ పలు చోట్ల స్లో కథనంతో సినిమా బోరింగ్ గా సాగుతుంది అని చెప్పాలి. అలాగే షణ్ముఖ్ ఇంకా నటుడుగా బెటర్ గా చేయాల్సింది. కొన్ని కీలక ఎమోషన్స్ సీన్స్ లో తన నటన ఇంకా మెరుగ్గా చేయాల్సింది.
లిమిటెడ్ గా ఇంతవరకే చేస్తాను అన్నట్టు ఆ సీన్స్ లో తన పెర్ఫామెన్స్ కనిపిస్తుంది. వాటి నుంచి తాను బయటకి రావాలి. అలాగే ప్రముఖ టాలెంటెడ్ సీనియర్ నటులు ఆమని, గోపరాజు రమణ రాజు ఇంకా రూప లాంటి వారు ఉన్నారు కానీ వారి పాత్రలు ఈ సినిమాలో తన ఇంపాక్ట్ చూపించవు. సో ఇలాంటి నటీనటుల ప్రెజెన్స్ సినిమాలో వేస్ట్ అయ్యింది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ వర్క్స్ ఈ సినిమాలో ప్లెజెంట్ గా ఉన్నాయి. అలాగే ఎడిటింగ్ గా ఇంకా బెటర్ గా చేయాల్సింది. ఇక దర్శకుడు పవన్ సుంకర విషయానికి వస్తే.. డీసెంట్ లైన్ ని తాను ఎంచుకున్నాడు కానీ దానిని ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేసే స్కోప్ తీసుకోవాల్సింది. కొన్ని మూమెంట్స్ వరకు పర్వాలేదు కానీ ఇంకొన్ని ఎమోషన్స్ ని బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉండుంటే ఈ సినిమా ఇంకా ఎఫెక్టీవ్ గా అనిపించి ఉండేది. వీటితో అయితే తన వర్క్ ఓకే అని చెప్పొచ్చు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “లీలా వినోదం” లో కొన్ని సీన్స్ వరకు పర్వాలేదు అనిపిస్తుంది అలానే మంచి నోస్టాలజిక్ మూమెంట్స్ కూడా సినిమాలో బాగున్నాయి. మెయిన్ లీడ్ నడుమ డ్రామా కొంతమేర ఇంప్రెస్ చేస్తుంది కానీ ఓవరాల్ గా మాత్రం ఈ సినిమా ఒక ప్యాకెడ్ ఎంటర్టైనర్ కాదని చెప్పాలి. ఇంకా బెటర్ గా పలు సన్నివేశాలు డిజైన్ చేసి కంప్లీట్ చేయాల్సింది. వీటితో ఈ చిత్రం కేవలం కొంత మేరకు మాత్రమే ఓకే అనిపిస్తుంది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team