ఆదికేశవ: ఎనర్జిటిక్ గా లీలమ్మో సాంగ్ ప్రోమో!

ఆదికేశవ: ఎనర్జిటిక్ గా లీలమ్మో సాంగ్ ప్రోమో!

Published on Oct 24, 2023 6:32 PM IST


టాలీవుడ్ యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఆదికేశవ. ఈ చిత్రం ను నవంబర్ 10, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నుండి థర్డ్ సింగిల్ కి సంబందించిన ప్రోమో సాంగ్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.

లీలమ్మో అంటూ సాగే ఈ పాట ఎనర్జిటిక్ గా ఉంది. పూర్తి పాటను రేపు 4:05 గంటలకి రిలీజ్ చేయనున్నారు మేకర్స్. శ్రీ లీల మరియు వైష్ణవ్ తేజ్ ఎనర్జిటిక్ డాన్స్ విశేషం గా ఆకట్టుకుంటుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నాగ వంశీ, సాయి సౌజన్య లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు