‘ఘంటసాల’ బయోపిక్ విడుదల తేదీ ఖరారు..

‘ఘంటసాల’ బయోపిక్ విడుదల తేదీ ఖరారు..

Published on Dec 1, 2024 11:01 PM IST

మన తెలుగు సినిమా ఉన్నన్నినాళ్లు గుర్తుండిపోయే అతి కొంతమంది పేర్లలో గాన గాంధర్వ ఘంటసాల గారి పేరు కూడా ఒకటి. మరి మన తెలుగు సినిమా వృద్ధి చెందుతున్న మొదట్లో తన సంగీతం అలాగే తన గానంతో తెలుగు సినిమా సంగీతానికి ప్రాణంలా నిలిచిన ఘంటసాల గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన గొంతులోని మాధుర్యంతో ఎన్నో పాటలు ఇప్పటికీ చెరగనివిగా నిలిచిపోయాయి.

మరి ఇలాంటి మహనీయుని భావి తారలు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన లేటెస్ట్ సినిమానే “ఘంటసాల” ది గ్రేట్ అనేది ఉప శీర్షిక. దర్శకుడు సి హెచ్ రామారావు తెరకెక్కించిన ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని మాజీ ఉప ప్రధాని వెంకయ్య నాయుడు నేడు విడుదల చేశారు. మరి దీనితో ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న రిలీజ్ కి సిద్ధం చేస్తున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు