స్క్రిప్ట్ రాస్తోన్న లెజండరీ దర్శకుడు !

Published on Aug 9, 2020 2:23 am IST

తెలుగు ఇండస్ట్రీలో అప్పట్లో వైవిధ్యానికి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ఇప్పటి జనరేషన్ కూడా ఆయన తీసిన అప్పటి సినిమాలను బాగా ఇష్టపడతారు. ముఖ్యంగా ‘పుష్పక విమానం, ఆదిత్య 369, అపూర్వ సోదరులు’ లాంటి భిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలు ఇప్పటికీ గొప్ప వైవిధ్యమైన చిత్రలుగా నిలుస్తున్నాయి. తన అభిరుచి ఇప్పటికీ కొత్తగానే అనిపించేలా ముద్ర వేసిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు.

ప్రస్తుతం ఆయన 90 ఏళ్లకి సమీపంలో ఉన్నా.. ఓ సినిమా తీద్దామనే ఆలోచిస్తున్నారట. సింగీతం ఒక స్క్రిప్ట్ ను తయారు చేస్తున్నారట. ఈ జనరేషన్ సినిమాల గురించే ఆలోచిస్తూ ఇప్పటి ట్రెండ్ కి అనుగుణంగా స్క్రిప్ట్ ని రాసుకున్నారు. కమర్షియల్ సినిమాల హవా నడుస్తున్నా.. ఆయన తన పద్దతిలో ఒక సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. గత సంవత్సరమే ‘ఆదిత్య 369’ సీక్వెల్ తీయాలనుకున్నారు. అది వర్కౌట్ అవ్వలేదు.

సంబంధిత సమాచారం :

More