ప్రముఖ పాకీస్తానీ సింగర్ నయ్యారా నూర్ ఇక లేరు అని తెలిసి ఆమె అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. ఆమె అనారోగ్య సమస్యలతో ఈ రోజు కన్నుమూశారు. 1950లో అస్సాంలో పుట్టిన నూర్.. అక్కడి నుండి పాకిస్తాన్‌కు వలస వెళ్లారు. 1968లో సంగీత ప్రపంచంలోకి ప్రవేశించిన నూర్ ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన పాటలు పాడి.. సినీ లోకంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.
ఆమెకు పాకిస్థాన్ లో విశేష అభిమానులు ఉన్నారు. అందుకే ఆమెను ‘బుల్‌బుల్-ఎ-పాకిస్తాన్’ (నైటింగేల్ ఆఫ్ పాకిస్తాన్) అంటారు. ఇక ఆమె పర్సనల్ లైఫ్ కి వస్తే.. 71 ఏళ్ల నూర్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక ఆమెకు పలువురు సినీ ప్రముఖులు కడసారి నివాళులు అర్పించారు.
123తెలుగు.కామ్ తరఫున సింగర్ నయ్యారా నూర్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.