‘లియో’ : ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ పై ఊహించని కామెంట్స్ చేసిన సినిమాటోగ్రాఫర్

‘లియో’ : ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ పై ఊహించని కామెంట్స్ చేసిన సినిమాటోగ్రాఫర్

Published on Oct 22, 2023 3:11 AM IST

ఇళయదళపతి విజయ్ హీరోగా యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా హై టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ లియో. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా కనిపించగా అర్జున్, సంజయ్ దత్ కీలక పాత్రలు చేసారు. రెండు రోజుల క్రితం పలు భాషల్లో రిలీజ్ అయిన లియో మంచి టాక్ తో కొనసాగుతోంది.

అయితే ఈ మూవీలో చూపించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేదు. కాగా విషయం ఏమిటంటే, ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పై ఈమూవీ ఫోటోగ్రాఫర్ అయిన మనోజ్ పరమహంస తాజాగా ఒక ఇంటర్వ్యూ లో భాగంగా ఊహించని కామెంట్స్ చేసారు. ఆ ఎపిసోడ్ ఫేక్ కూడా కావచ్చు కదా, అలానే దానికి సంబంధించి మరికొన్ని నిముషాలు చూపించాల్సిన సీన్స్ ఉన్నాయని దర్శకుడు లోకేష్ తనతో అన్నారని తెలిపారు.

అలానే ఆ ఫ్లాష్ బ్యాక్ ని వివరించిన అపరిచిత వ్యక్తి అయిన (మన్సూర్ ఆలీ ఖాన్) చెప్పినది నిజం కాకపోవచ్చు కదా అని అన్నారు. దీనితో ఒక్కసారిగా ఆడియన్స్ షాక్ అవుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంతకీ లియోలో ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఒకవేళ నిజం కాకపోతే తదుపరి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తీసే సినిమాల్లో అసలు సీన్స్ ఉండవచ్చని భావిస్తున్నారు. మొత్తంగా మనోజ్ పరమహంస కామెంట్స్ ప్రస్తుతం వైరల్ పైగా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు