యూఎస్ లో భారీ నంబర్స్ తో దూసుకెళ్తున్న “లియో”

యూఎస్ లో భారీ నంబర్స్ తో దూసుకెళ్తున్న “లియో”

Published on Oct 8, 2023 9:00 AM IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “లియో” కోసం అందరికీ తెలిసిందే. మరి లేవో చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతున్న సమయంలో మేకర్స్ కూడా సాలిడ్ ప్రమోషన్స్ ని ఇప్పుడు చేస్తుండగా ఈ చిత్రానికి ఓవర్సీస్ మార్కెట్ లో కూడా గట్టి క్రేజ్ నెలకొంది. ఇక యూఎస్ లో అయితే ఈ సినిమాకి సెన్సేషనల్ నంబర్స్ నమోదు అవుతున్నాయి.

రీసెంట్ గానే జస్ట్ ప్రీ సేల్స్ లో ఏకంగా హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ ని క్రాస్ చేసేసిన ఈ చిత్రం ఇప్పుడు మరో లక్ష డాలర్స్ రాబట్టి 6 లక్షల డాలర్స్ మార్క్ ని టచ్ చేసింది. ఇంకా సినిమా రిలీజ్ కి 10 రోజులు సమయం ఉన్నప్పటికీ ఈ రేంజ్ లో లియో యూఎస్ లో అయితే అంచనాలు ఏర్పర్చుకుంది. ఇక రిలీస్ నాటికి అయితే ఈజీగా 1.5 మిలియన్ మేర ప్రీ సేల్స్ లోనే వచ్చేస్తాయని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. మరి చూడాలి లియో ఎక్కడ వెళ్తుందో అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు