లియో లేటెస్ట్ యూకే వసూళ్లు ఇవే!

లియో లేటెస్ట్ యూకే వసూళ్లు ఇవే!

Published on Oct 23, 2023 6:45 PM IST


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ టైటిల్ రోల్ లో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ లియో థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. యూకే లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ ను కనబరుస్తోన్న ఈ సినిమా, ఇప్పటి వరకూ ఈ ప్రాంతం లో 1.24 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టడం జరిగింది.

కోలీవుడ్ లో ఇప్పటి వరకూ ఈ ప్రాంతంలో ఫస్ట్ వీకెండ్ కి ఇదే హయ్యెస్ట్. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు