తెలుగు స్టేట్స్ లో దుమ్ము లేపుతున్న “లియో”

తెలుగు స్టేట్స్ లో దుమ్ము లేపుతున్న “లియో”

Published on Oct 21, 2023 9:20 PM IST


ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా త్రిష కృష్ణన్ హీరోయిన్ గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కించిన మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “లియో”. తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కించిన ఈ చిత్రం అంచనాలును ఆల్ మోస్ట్ అందుకొని వరల్డ్ వైడ్ గా రికార్డు వసూళ్లు కొల్లగొడుతుంది. అక్కడ ఇక్కడా అని తేడా లేకుండా రిలీజ్ అయ్యిన అన్ని చోట్ల కూడా సెన్సేషనల్ పెర్ఫామెన్స్ ని కనబరుస్తున్న ఈ చిత్రం రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టింది.

మరి డే 2 తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రం 8 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకోగా ఈ రెదను రోజుల్లో అయితే లియో చిత్రం 24 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టింది. దీనితో అయితే ఫుల్ రన్ లో ఈ చిత్రం డెఫినెట్ గా 50 కోట్లకి పైగానే రాబట్టిన ఆశ్చర్యం లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ తదితరులు నటించగా అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే 7 స్క్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు. తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ వారు రైట్స్ కొని రిలీజ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు