సమీక్ష : “లైగర్” – ఓన్లీ మాస్ కి మాత్రమే!

సమీక్ష : “లైగర్” – ఓన్లీ మాస్ కి మాత్రమే!

Published on Aug 26, 2022 1:01 AM IST
Liger Movie Review In Telugu

విడుదల తేదీ : ఆగస్టు 25, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను

దర్శకత్వం : పూరీ జగన్నాథ్

నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా

సంగీత దర్శకుడు: సునీల్ కశ్యప్, విక్రమ్ మాంట్రోస్, తనిష్క్ బాగ్చి, జానీ, లిజో జార్జ్, డీజే చేతస్

సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ

ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండేల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ లైగర్. కాగా ఈ సినిమా ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

లైగర్ (విజయ్ దేవరకొండ) మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కోసం తన తల్లి బాలమణి (రమ్యకృష్ణ)తో కలిసి బతకడానికి ముంబై వస్తాడు. నేషనల్ ఛాంపియన్ అవ్వాలని కల కంటాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య లైగర్, తాన్య (అనన్య పాండే)తో ప్రేమలో పడతాడు. మరీ లైగర్ జర్నీలో తాన్య ప్రేమ దేనికి దారి తీసింది ?, లైగర్ తాను అనుకున్న గోల్ కి రీచ్ అయ్యాడా? లేదా ?, అసలు లైగర్ త‌న క‌ల‌ని నిజం చేసుకోవడానికి చేసిన కృషి ఏమిటి ?, ఈ మధ్యలో మైక్ టైస‌న్ ట్రాక్ ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాకి వచ్చినంత హైప్, ఈ మధ్య కాలంలో పూరి సినిమాల్లో దేనికి రాలేదు. మరి, భారీ అంచనాల మధ్య పక్కా మాస్ మసాలా అంశాలతో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మొత్తానికి మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇక విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడు. ఫుల్ ఎనర్జీతో సాగే విజయ్ యాక్టింగ్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా కోసం విజయ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి.

లైగర్ క్యారెక్టర్‌ లో విజయ్ చక్కని నటనను కనబరిచాడు. గత సినిమాల్లో కంటే, ఈ సినిమాలో విజయ్ నటన చాలా కొత్తగా ఉంటుంది. తన హై ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో విజయ్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక విజయ్ సరసన హీరోయిన్ గా నటించిన అనన్య పాండే తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మరియు తన గ్లామర్ తో బాగా అలరించింది. కొన్ని ప్రేమ సన్నివేశాల్లో విజయ్ – అనన్య మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. రమ్యకృష్ణ, అలీ, మైక్ టైసన్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

 

మైనస్ పాయింట్స్ :

 

పూరి మంచి స్టోరీ లైన్ ను అలాగే లైగర్ అనే మంచి క్యారెక్టర్ ను రాసుకున్నప్పటికీ, ఆ లైన్ ను ఆ క్యారెక్టర్ కి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. దీనికి తోడు, సినిమాలో యూత్ ని ఎట్రాక్ట్ చేసే క్రమంలో ప్రతి సన్నివేశంలో అవసరం ఉన్నా లేకపోయినా బోల్డ్ నెస్ ను ఇరికించడం కొంత ఇబ్బందిగా అనిపిస్తోంది. పైగా సెకెండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు మరి స్లోగా సాగుతాయి.

ఇక ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ ప్రేమలో పడే సన్నివేశాలతో పాటు సెకెండ్ హాఫ్ లో ఆ లవ్ తాలూకు ట్విస్ట్ కూడా మరీ సిల్లీగా ఉంది. మదర్ క్యారెక్టర్ ఎలివేషన్ కూడా బాగాలేదు. రమ్యకృష్ణ పాత్ర మరీ ఫోర్స్ గా ఉంది. ఇక సినిమాలో కీలక సన్నివేశాలకు సరైనా లాజిక్ కూడా ఉండడు. పైగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ కాదు. ఇక క్లైమాక్స్ లో మెయిన్ పాయింట్ కి ఆధారంగానే సరైన ముగింపు ఇచ్చి ఉంటే బాగుండేది. అలాగే మైక్ టైసన్ సీక్వెన్స్ ను కూడా ఇంకా బలంగా రాసుకోవాల్సింది.

 

సాంకేతిక విభాగం :

 

ఈ సినిమాలో సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్ తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు. అలాగే సినిమాలో నేపధ్య సంగీతంతో పాటు లాస్ట్ సాంగ్ కూడా బాగుంది. ముఖ్యంగా సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా, సినిమాలో వచ్చే పరిస్థితులకు తగట్లుగా పాటలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఎడిటర్ సినిమాను ఇంకా ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో పక్కా యాక్షన్ ఎంటర్టైనెర్ గా వచ్చిన ఈ చిత్రం కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాల పరంగా బాగానే ఆకట్టుకున్నా.. సినిమా మాత్రం పూర్తిస్థాయిలో ఆసక్తికరంగా సాగలేదు. కథనం రొటీన్ గా సింపుల్ గా ఉండటం, కొన్ని చోట్ల సీన్స్ సిల్లీగా సాగడం, ఇక సినిమాలో ఉన్న బలమైన కాన్ ఫ్లిక్ట్ ను పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. అయితే విజయ్ దేవరకొండ హై ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఓవరాల్ గా లైగర్ మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. అయితే, మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం కనెక్ట్ కాదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు