విడుదల తేదీ : అక్టోబరు 27, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: కార్తీక్ రత్నం, సుప్యార్దీ సింగ్, బల్వీర్ సింగ్, కునాల్ కౌశిక్, తాగుబోత్ రమేష్, ఉత్తేజ్
దర్శకుడు : ఆనంద్ బడా
నిర్మాత: యాదగిరి రాజు
సంగీతం: బికాజ్ రాజ్
ఎడిటర్: మ్యాడీ అండ్ బడా శశికాంత్
సంబంధిత లింక్స్: ట్రైలర్
C/o కంచెరపాలెం, నారప్ప చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ రత్నం ఇప్పుడు లింగోచ్చా సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఆనంద్ బడా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.
కథ:
హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ లో ఈ లింగోచ్చా సినిమా సెట్ చేయడం జరిగింది. ఇది శివ (కార్తీక్ రత్నం) మరియు నూర్జహాన్ (సుప్యార్దీ సింగ్) చిన్నప్పటి నుండి ఒకరినొకరు ఇష్ట పడతారు. అయితే నూర్జహాన్ అకస్మాత్తుగా దుబాయ్ కి వెళ్తుంది. కానీ శివ మాత్రం ఆమె కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. చాలా సంవత్సరాల తర్వాత, నూర్జహాన్ భారతదేశానికి తిరిగి వస్తుంది. మళ్లీ ఈ జంట ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. కానీ నూర్జహాన్ సోదరుడు అన్వర్ (కునాల్ కౌశిక్) వారి ప్రేమకి అడ్డు చెబుతాడు. శివ మరియు నూర్జహాన్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారు అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్:
కార్తీక్ రత్నం తన నటనతో ఇప్పటికే ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం లో మరోసారి తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందించాడు. శివగా అతని సహజమైన నటన చాలా బాగుంది. క్లైమాక్స్‌లో ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగా నటించారు.
సుప్యార్దీ సింగ్ లేడీ లీడ్ రోల్ లో ఆకట్టుకుంది. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ మరియు బాడీ లాంగ్వేజ్ తో పాత్రకి పూర్తి న్యాయం చేసింది. కార్తీక్ రత్నంతో సుప్యార్దీ కెమిస్ట్రీ స్క్రీన్ పై బాగానే వర్కౌట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి.
మైనస్ పాయింట్స్:
లింగోచ్చా కి అతి పెద్ద మైనస్ ఏమిటంటే, ఇది పాత కథను కలిగి ఉంది. అందరికీ తెలిసిన స్టోరీ లాగానే అనిపిస్తుంది. ప్రధాన జంట వేర్వేరు మతాలకు చెందినవారు, మరియు అమ్మాయి తల్లిదండ్రులు వారి ప్రేమను వ్యతిరేకించారు. ఇలాంటి సినిమాకి గ్రిప్పింగ్ గా ఉండే స్క్రీన్ ప్లే చాలా అవసరం. కానీ లింగొచ్చా కథనం అంత ఎనర్జిటిక్ గా సాగదు. చాలా బోరింగ్ గా అనిపిస్తుంది.
ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే, సెకండాఫ్ మొత్తం బోరింగ్ గా ఉంది. హీరో మరియు హీరోయిన్ మధ్య కన్ఫ్లిక్ట్ సరిగ్గా లేదు. డైరెక్టర్ ఎంచుకున్న అంశం బాగానే ఉన్నా, అది కరెక్ట్ గా ప్రెజెంట్ చేయలేదు. హీరో పాత్ర సెకండ్ హాఫ్ లో చాలా మారుతుంది. వీటిని డైరెక్టర్ మరింత బాగా హ్యాండిల్ చేయొచ్చు.
సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి కథనం చాలా స్లో గా సాగుతుంది. ఎడిటింగ్ టీమ్ మరింత మెరుగ్గా పని చేసి ఉండవచ్చు. కామెడీ సన్నివేశాలు అనుకున్నంతగా బాగా రాలేదు. అంతేకాక హీరోయిన్ సోదరుడి పాత్రను చాలా పూర్ గా డిజైన్ చేశారు.
సాంకేతిక విభాగం:
మ్యూజిక్ డైరెక్టర్ బికాజ్ రాజ్ లింగోచ్చాతో ఆకట్టుకున్నాడు. సినిమాలో విజువల్స్ బాగున్నాయి, ఓల్డ్ సిటీని చాలా బాగా చిత్రీకరించారు. ఎడిటింగ్ ఇంకా బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
డైరెక్టర్ ఆనంద్ బడా రొటీన్ స్టోరీ ను ఎంచుకుని బోరింగ్ గా నేరేట్ చేశాడు. కాన్ఫ్లిక్ట్ పాయింట్ అంతగా ఆకట్టుకోదు. దీనిపై శ్రద్ధ వహించి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. క్లైమాక్స్ డీసెంట్‌గా ఉన్నప్పటికీ, అప్పటికే ఆడియెన్స్ కి ఆసక్తి తగ్గుతుంది.
తీర్పు:
మొత్తం మీద, లింగోచ్చా సినిమా ఓల్డ్ స్టోరీ తో బోరింగ్ గా సాగే రొమాంటిక్ డ్రామా. హీరో హీరోయిన్ లు అయిన కార్తీక్ రత్నం మరియు సుప్యార్దీ సింగ్ ల నటన ఆకట్టుకుంటుంది. కానీ ఈ సినిమాలో ఆసక్తికరం గా సాగే స్క్రీన్ ప్లే లేదు. ఫస్ హాఫ్ లో నటీనటుల పర్ఫార్మెన్స్ లు బాగానే ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ బోరింగ్ స్క్రీన్ ప్లే తో సాగుతుంది. సినిమా మొత్తానికి అంతగా ఆకట్టుకోదు.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team