అద్భుతంగా జరిగిన బిజినెస్ మ్యాన్ ‘లయన్ కిరన్’ ‘కే పార్టీ’

అద్భుతంగా జరిగిన బిజినెస్ మ్యాన్ ‘లయన్ కిరన్’ ‘కే పార్టీ’

Published on Dec 5, 2022 9:40 AM IST

రోజురోజుకు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ దూసుకుపోతున్న దేశానికి తలమానికమైన ప్రఖ్యాత హైదరాబాద్ నగరం మరొకసారి వినూత్న శైలిలో ఆకట్టుకుంటూ కె1 పార్టీకి వేదిక అయ్యింది. హైదరాబాద్ లో మొట్ట మొదటి సారి ఎఫ్ 1 రేస్ కార్స్ తో కె1 స్టైల్ థీమ్ ఫ్యాషన్ షో మోడల్స్ అదరహో అనిపించారు. కె1 ఫ్యాషన్ షో లో తారల సందడి అందరినీ ఆకట్టుకుంది. పార్టీ ప్రియులకు మునుపెన్నడూ ఎరుగని అనుభూతులను అందించి వావ్ అనిపించింది. విషయం లోకి వెళితే సుచిర్ ఇండియా డెవలప్ మెంట్ అధినేత లయన్ కిరణ్ బర్త్ డే పార్టీని ఆయన సన్నిహితులు కే పార్టీగా ప్రతి ఏడాది ఎదో ఒక థీమ్ తో చేస్తూ ఉంటారు. అలానే ఈ ఏడాది కూడా కనివినీ ఎరగని రితీలో నిర్వహించారు. అందులో కె పార్టీ ఫ్యాషన్ షో అదరహో అనే రేంజ్ లో జరిగింది.

అలానే అందులో భాగంగా ఈ ఆదివారం జలవిహార్ లో కె పార్టీ F1 రేస్ కార్స్ తో కె1 స్టైల్ ఫ్యాషన్ మరియు బాలీవుడ్ డాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కె పార్టీ లో టాలీవుడ్ స్టార్స్, సినీనటులు, టాప్ బిజినెస్ మాన్స్ పాల్గొన్నారు. F1 స్టైల్ థీమ్ లో నిర్వహించిన ఈ నైట్ ఈవెంట్ ఆద్యంతం అతిధుల కు అపురూపమైన అనుభూతి పంచింది. వివిధ రకాల నృత్యాలు, ఎన్నో రకాల పసందైన రుచికరమైన భోజనాలు, వినోదాలు, ఫ్యాషన్ షో అదరహో అనిపించాయి. స్వయంగా లయన్ కిరణ్ షో స్టాపర్ గా మారడం విశేషం. ఆయన రాంప్ వాక్ ఆహూతుల హర్షధ్వానాలు అందుకుంది. మొత్తంగా అందరినీ ఆకట్టుకునేలా అత్యద్భుతంగా అదరహో అనే రేంజ్ లో కిరోన్ కె పార్టీ జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు