దిల్ రాజు నేతృత్వంలో సీఎం రేవంత్‌తో టాలీవుడ్ భేటీ

టాలీవుడ్‌పై తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఓ వ్యక్తి మృతికి కారణం అయిన ఘటన చోటుచేసుకోవడంతో రేవంత్ రెడ్డి ఇలాంటి కామెంట్స్ చేయడంతో, ఆయనను కలిసేందుకు సినీ పరిశ్రమ సిద్ధమయ్యింది.

తెలంగాణ ఫిలిం డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం భేటీ కానున్నారు. దీంతో అందరి చూపులు ఈ భేటీ పైనే ఉన్నాయి. ఇక ఈ భేటీలో టాలీవుడ్‌కు చెందని 36 మంది సభ్యులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. హీరోల నుంచి వెంకటేష్, నాగార్జున, నితిన్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్, శివ బాలాజీ సీఎంతో భేటీకి హాజరుకానున్నారు.

నిర్మాతల నుంచి దిల్ రాజు, అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్, సుప్రియ యార్లగడ్డ, చినబాబు, నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవి శంకర్, విశ్వప్రసాద్, సుధాకర్ రెడ్డి, రవి కిషోర్, కె ఎల్ నారాయణ, భోగవల్లి ప్రసాద్ తదితరులు ఈ భేటీలో పాల్గొననున్నారు. అటు దర్శకుల సంఘం నుంచి ఈ భేటీకి అధ్యక్షుడు వీర శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, సాయి రాజేష్, వశిష్ఠ, బాబీ, వంశీ పైడిపల్లి, ప్రశాంత్ వర్మ తదితరులు హాజరుకానున్నారు.

వీరితో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, సెక్రటరీ దామోదర్ ప్రసాద్.. మా అసోసియేషన్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి పలువురు ప్రతినిధులు కూడా ఈ భేటీలో పాల్గొంటారు. ప్రభుత్వం నుండి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ ఈ భేటీలో పాల్గొని సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నారు.

Exit mobile version