లాక్ డౌన్ రివ్యూ: బ్రీత్ ఇంటూ ది షాడోస్-హిందీ సిరీస్(అమెజాన్ ప్రైమ్)

లాక్ డౌన్ రివ్యూ: బ్రీత్ ఇంటూ ది షాడోస్-హిందీ సిరీస్(అమెజాన్ ప్రైమ్)

Published on Jul 11, 2020 4:02 PM IST

నటీనటులు: అభిషేక్ బచ్చన్, అమిత్ సాధ్, నిత్యా మీనన్, ఇవానా కౌర్, సైయామి ఖేర్, హృషికేశ్ జోషి, శ్రుతి బాప్నా, రేశం శ్రీవర్ధన్

దర్శకత్వం: మయాంక్ శర్మ

నిర్మాతలు: విక్రమ్ మల్హోత్రా, నిధి అగర్వాల్, అజయ్ జి రాయ్, విజయ్ కొఠారి

ఛాయాగ్రహణం: ఎస్.భారత్వాజ్

ఎడిటింగ్: సుమీత్ కోటియన్

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు హిందీ వెబ్ సిరీస్ బ్రీత్ ఇంటూ ది షాడోన్ ని ఎంచుకోవడం జరిగింది. అభిషేక్ బచ్చన్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..

 

కథాంశం ఏమిటీ?

 

భార్యాభర్తలైన అవినాష్ సభర్వాల్(అభిషేక్ బచ్చన్) అభా సభర్వాల్(నిత్యా మీనన్) తమ ఆరేళ్ళ కూతురు సియాతో హ్యాపీ లైఫ్ గడుపుతూ ఉంటారు. సియా కిడ్నాప్ వారి జీవితాలలో కలకలం రేపుతోంది. సియాను కిడ్నాప్ చేసినవాడు అవినాష్ ని డబ్బులకు బదులుగా తాను చెప్పినవారిని చంపవలసిందిగా కోరుతాడు. తన డిమాండ్ నెరవేర్చని పక్షంలో సియాను చంపేస్తాను అని బెదిరిస్తాడు. మరి కూతురు కోసం అవినాష్ కిల్లర్ గా మారతాడా? అసలు ఈ కిడ్నాపర్ ఎవరు? అతను కొందరిని ఎందుకు చంపాలని అనుకుంటున్నాడు? సియా సేఫ్ గా తల్లిదండ్రుల వద్దకు చేరిందా లేదా ? అనేది మిగతా కథ

 

ఏమి బాగుంది.

 

ఈ సిరీస్ తో హీరో అభిషేక్ బచ్చన్ ఘనమైన ఓ టి టి ఎంట్రీ ఇచ్చారని చెప్పొచ్చు. కిడ్నాప్ కి గురైన కూతురు కోసం తపించే తండ్రి పాత్రలో ఆయన జీవించారు. తన ఆవేదన, బాధలను అభిషేక్ కళ్లతో పలికించారు. ఈ పాత్రకు ఆయన వంద శాతం న్యాయం చేశారు. ఇక సిరీస్ లో అభిషేక్ పాత్రతో సమానంగా సాగే ఆయన భార్య పాత్రలో నిత్యా అధ్బుత నటన కనబరిచారు. ఆమె హిందీ డిక్షన్ కూడా చక్కగా కుదిరింది. అభిషేక్ కి సపోర్టింగ్ ఇచ్చే భార్యగా నిత్యా అలరించారు. ప్రమాదంలో ఉన్న కూతురు కోసం తల్లిదండ్రులు మరియు క్రిమినల్ మధ్య నడిచే డ్రామా చక్కగా కుదిరింది.

ప్రతి ఎపిసోడ్ లో మైమరిపించే మలుపులు, మంచి ముగింపు ఆకట్టుకుంటాయి. సయామీ ఖేర్ పాత్రతో పాటు అమిత్ షద్ పోలీస్ గా మెప్పించారు. ఇక అధ్బుతమైన బీజీఎమ్ కి తోడు ఆకట్టుకునే కథనం ప్రేక్షకుడికి మంచి అనుభూతిని పంచుతాయి. ఇక సిరీస్ మధ్యలో వచ్చే ఓ ట్విస్ట్ షాక్ కి గురిచేస్తుంది.

 

ఏమి బాగోలేదు?

 

12ఎపిసోడ్స్ కలిగిన ఈ సిరీస్ కొంచెం నిడివి చాలా ఎక్కువన్న భావన కలుగక మానదు. ఇక సస్పెన్సు రివీల్ అయిన తరువాత వచ్చే సన్నివేశాలు నెమ్మదించాయి. ఎడిటింగ్ విషయంలో కొంచెం నైపుణ్యం కనబరిచి ఉంటే బాగుండేది. అలాగే అమిత్ షాద్ లవ్ స్టోరీ కుడా కొంచెం సాగదీత ధోరణిలో సాగింది.

 

చివరి మాటగా

 

మొత్తంగా చెప్పాలంటే అలరించే కథనం, ఆకట్టుకొనే మలుపులతో పాటు అభిషేక్ మరియు నిత్యా మీనన్ నటనతో ఈ సిరీస్ అలరించడం ఖాయం. ఎక్కువ నిడివి, ఎడిటింగ్ వైఫల్యాలు మినహాయిస్తే బ్రీత్ అధ్బుతమైన వెబ్ సిరీస్ అని చెప్పాలి. ఈ లాక్ డౌన్ సమయంలో బ్రీత్ మంచి ఛాయిస్ అనడంలో సందేశం లేదు.

Rating: 3/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు