లాక్ డౌన్ రివ్యూ: దూర్ కే దర్శన్- హిందీ ఫిల్మ్ (నెట్ ఫ్లిక్స్)

లాక్ డౌన్ రివ్యూ: దూర్ కే దర్శన్- హిందీ ఫిల్మ్ (నెట్ ఫ్లిక్స్)

Published on Jul 28, 2020 3:36 PM IST

నటీనటులు: మహీ గిల్, మను రిషి చద్దా, డాలీ అహ్లువాలియా, సుప్రియ శుక్లా, రాజేష్ శర్మ.
దర్శకత్వం: గగన్ పూరి
నిర్మాతలు: రితు ఆర్య, సందీప్ ఆర్య
సంగీతం: మీట్ బ్రోస్
సినిమాటోగ్రఫీ: సోని సింగ్
ఎడిట్ చేసినవారు: శుభం శ్రీవాస్తవ

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు హిందీ ఫిల్మ్ దూర్ కే దర్శన్ ఎంచుకోవడం జరిగింది. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

 

కథాంశం ఏమిటీ?

 

భార్య వదిలి వెళ్లిపోవడంతో సునీల్(మను ఋషి) తన ఇద్దరు టీనేజ్ పిల్లలతో గడుపుతూ ఉంటాడు. 30 ఏళ్లుగా కోమాలో ఉన్న సునీల్ తల్లి దర్శన్(డాలీ అహ్లువాలియా) స్పృహలోకి రావడంతో సునీల్ కి కొత్త కష్టాలు మొదలవుతాయి. ఆమె ఆరోగ్య కారణాల రీత్యా ఆమెకు షాక్ గురిచేసే అంశాలు ఏమీ చెప్పకండి అని డాక్టర్ చెవుతారు. దీనితో వాళ్ళ అమ్మ సంతోషం కోసం సునీల్ ఆమెకు తను కేవలం ఆరు నెలలు కోమాలో ఉన్నట్లు అబద్దం చెబుతాడు. 30 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇంటిలో ఏర్పాటు చేసే క్రమంలో సునీల్ పడే ఇబ్బందులే ఈ చిత్రం..

 

ఏమి బాగుంది?

 

ఢిల్లీ నేపథ్యంలో నడిచే దూర్ కే దర్శన్ మూవీ కథ మరియు కథనాలు ఆకట్టుకుంటాయి. ప్రధాన పాత్ర చేసిన మను రుషి మూవీని అన్నీ తానై నడిపారు. కాంప్లెక్సిటీతో కూడుకొన్న ఆయన పాత్రను చక్కగా రక్తికట్టించారు.ఇక మను తల్లి పాత్ర చేసిన సీనియర్ నటి డాలీ అహ్లువాలియా నటన అక్కడక్కగా ఓవర్ అనిపించినా, ఆ పాత్రకు ఆమె కరెక్ట్ అన్న భావన కలిగింది.

మను మరియి ఆయన భార్య పాత్రకు మధ్య సంఘర్షణ బాగుంది. ఢిల్లీ దిగువ మధ్యతరగతి కుటుంబాలలో కనిపించే సంఘటనలు చెప్పిన విధానం బాగుంది. మూవీలో ఢిల్లీ హిందీ యాస బాగుంది. హ్యూమర్ పండడంలో బాగా ఉపయోగపడింది.

 

ఏమి బాగోలేదు?

 

ఈ మూవీ ప్రధాన బలం కామెడీ అయినప్పటికీ కొన్ని సన్నివేశాలలో శృతి మించిన భావన కలుగుతుంది. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా స్లోగా సాగుతుంది. ప్రధాన కథలోకి వెళ్లడానికి చాలా సేపు సాగదీసిన భావన కాలుతుంది.

ఇక మహి గిల్ పాత్రకు చెప్పుకోదగ్గ ప్రాధానత్య లేదు. క్లైమాక్స్ సైతం అంతగా ప్రభావం చూపదు అని చెప్పాలి.

 

చివరి మాటగా

 

మొత్తంగా చెప్పాలంటే దూర్ కే దర్శన్ ఓ కామెడీ ఎంటర్టైనర్. ఈ చిత్రం చాలా వరకు ప్రేక్షకుడి వినోదం పంచుతుంది. కొంచెం మితిమీరిన కామెడీ, స్లోగా సాగె ఫస్ట్ హాఫ్ మరియు క్లైమాక్స్ నిరాశ పరిచే అంశాలు. కానీ ఈ లాక్ డౌన్ సమయంలో ఓ సారి చూసి ఎంజాయ్ చేయదగ్గ చిత్రమే .

Rating: 3/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు