లాక్ డౌన్ రివ్యూ: డ్రెవింగ్ లైసెన్స్ మలయాళ మూవీ(అమెజాన్ ప్రైమ్)

లాక్ డౌన్ రివ్యూ: డ్రెవింగ్ లైసెన్స్ మలయాళ మూవీ(అమెజాన్ ప్రైమ్)

Published on May 19, 2020 1:28 PM IST

నటీనటులు: పృథ్వి రాజ్, సూరజ్ తదితరులు…

నిర్మాతలు: సుప్రియా మెనాన్ & లిస్టిన్ స్టీఫెన్

దర్శకత్వం: లాల్ జూనియర్

సినిమాటోగ్రఫీ: అలెక్స్ జె పులికల్

సంగీతం: యక్జాన్ గ్యారీ పెరీరా & నేహా ఎస్ నాయర్

ఎడిటర్: రతీష్ రాజ్

 

లాక్ డౌన్ రివ్యూస్ లో నేడు డ్రెవింగ్ లైసెన్స్ మూవీని ఎంచుకోవడం జరిగింది. పృద్వి రాజ్, సూరజ్ ప్రధాన పాత్రలలో నటించగా లాల్ జూనియర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

 

కథాంశం ఏమిటీ?

రేసింగ్ కార్స్ ఇష్టపడే స్టార్ హీరో అయిన హరీంద్రన్(పృథ్విరాజ్)కి ఓ కార్ ఛేజ్ సీక్వెన్స్ లో నటించడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం అవుతుంది. ఐతే తన డ్రైవింగ్ లైసెన్స్ పోవడంతో ఆర్ టి ఓ ఆఫీస్ లో అప్లై చేసుకుంటారు. హరీంద్రన్ కి పెద్ద ఫ్యాన్ అయిన ఆర్ టి ఓ ఆఫీసర్ కురువిల్ల ఓ సంఘటన కారణంగా శత్రువుగా మారతాడు. స్టార్ హీరో హరీంద్రన్ మరియు ఆర్ టి ఓ ఆఫీసర్ కురువిల్లకు మధ్య ఇగో వార్ మొదలవుతుంది. సదుద్దేశం కలిగిన కురువెల్ల పెద్ద బ్యాక్ గ్రౌండ్ కలిగిన స్టార్ హీరోని లైసెన్స్ విషయంలో ఎలా కట్టడి చేశాడు అనేదే మిగతా కథ..

 

ఏమి బాగుంది?

ఓ సామాన్య ప్రభుత్వ ఉద్యోగికి, సూపర్ స్టార్ కి మధ్య ఇగో వార్ కన్వీన్సింగ్ గా వాస్తవానికి దగ్గరగా చెప్పిన తీరు బాగుంది. రెండు ప్రధాన పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్ పాయింట్ చక్కగా కుదిరింది. మంచి నటుడిగా పేరున్న పృద్వి రాజ్ స్టార్ హీరో పాత్రలో ఒదిగిపోయి నటించారు.

మరో ప్రధాన పాత్ర చేసిన సూరజ్ నటన మరియు అతని పాత్ర మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కామెడీ, ఎమోషన్స్ మరియు ఆకట్టుకొనే డైలాగ్స్ తో ఆయన పాత్ర ప్రేక్షకుడికి మంచి అనుభూతిని పంచుతుంది.

సీరియస్ స్టోరీ లో అంతర్లీనంగా వచ్చే సిట్యువేషనల్ కామెడీ బాగుంది. హీరో పృథ్వి రాజ్ ఫ్రస్ట్రేషన్ నుండి జెనెరేట్ అయ్యే ఆ కామెడీ కోణం బాగుంది. ప్రధాన పాత్రల మధ్య ముఖాముఖి సన్నివేశాలు, మూవీ ప్రొడక్షన్స్ వాల్యూస్, బీజీఎమ్ ఆకట్టుకుంటాయి.

 

ఏమి బాగోలేదు?

ఓ సూపర్ స్టార్ మరియు ఆర్ టి ఓ ఆఫీసర్ కి మధ్య నడిచే లైసెన్స్ వార్ ఎంత కన్వీన్సింగ్ తీసినా వాస్తవంగా అసాధ్యం కదా అనిపిస్తుంది. ఇక పృథ్వి రాజ్ మరియు సూరజ్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతకు గురైనట్లు అనిపిస్తుంది. స్లోగా మొదలయ్యే ఫస్ట్ హాఫ్ అసలు కథలోకి ప్రవేశించడానికి చాలా సమయం పడుతుంది.

 

చివరి మాటగా

ఓ మంచి సోషల్ పాయింట్ ని టచ్ చేస్తూ, ఎమోషన్స్ మరియు కామెడీ, అక్కట్టుకొనే కాన్ఫ్లిక్ట్ తో సాగే డ్రైవింగ్ లైసెన్స్ మూవీ ప్రేక్షకుడికి ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. పరిచయం లేని కథతో దర్శకుడు లాల్ జూనియర్ చేసిన మ్యాజిక్ అద్భుతం. కొంచెం స్లోగా సాగే ఫస్ట్ హాఫ్ మినహాయిస్తే డ్రైవింగ్ లైసెన్స్ తప్పక చూడాల్సిన మూవీ.

Rating: 3/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు