లాక్ డౌన్ రివ్యూ : ఖుదా హఫీజ్(డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చిత్రం)

లాక్ డౌన్ రివ్యూ : ఖుదా హఫీజ్(డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చిత్రం)

Published on Aug 18, 2020 2:22 PM IST

ప్రధాన పాత్రధారులు : విద్యుత్ జమ్వాల్, శివలీకా ఒబెరాయ్, అన్నూ కపూర్
దర్శకుడు : ఫరూక్ కబీర్
నిర్మాత : కుమార్ మంగత్ పాథక్, అభిషేక్ పాథక్
సినిమాటోగ్రఫీ : జితాన్ హర్మీత్ సింగ్
ఎడిటర్ : సందీప్ ఫ్రాన్సిస్

ఈ లాక్ డౌన్ సమయంలో పలు చిత్రాలు మరియు సిరీస్ ల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో నేడు మేము ఎంచుకున్న చిత్రం “ఖుదా హఫీజ్”. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి ఉన్న ఈ హిందీ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

2008 వ సంవత్సరంలో ఏర్పడిన ఆర్ధిక సంక్షోభం వల్ల సమీర్(విద్యుత్ జమ్వల్) అలాగే నర్గిస్(శివలీక ఓబ్రియో)లు తమ ఉద్యోగాలను కోల్పోతారు ఆ తర్వాత వారు పెళ్లి చేసుకుంటారు. అప్పుడు నర్గిస్ ఓ బ్రోకర్ ద్వారా జాబ్ చెయ్యడానికి నోమన్ కు వెళ్తుంది. తర్వాత అదే బ్రోకర్ సమీర్ ను కూడా తొందర లోనే అదే దేశానికి పంపుతానని చెప్తాడు. కానీ సమీర్ అక్కడికి వెళ్లలేకపోతాడు. కానీ నోమన్ లో ఊహించని విధంగా సమీర్ భార్య నర్గిస్ కిడ్నాప్ అవుతుంది. ఆ సమయంలో సమీర్ నోమన్ కు ఎలా వెళ్ళాడు? అతని భార్యను ఎలా కాపాడుకున్నాడు అన్నది మిగతా కథ.

ఏం బాగుంది :

బాలీవుడ్ కు చెందిన ఈ అండర్ రేటెడ్ హీరో అన్ని సినిమాలను మనం గమనించినట్లయితే విధ్యుత్ ఒకడు మాత్రమే ప్రధాన హైలైట్ అవుతాడు. అలా ఈ చిత్రానికి కూడా అతను మెయిన్ అసెట్ గా నిలిచాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలా ఈ చిత్రంలో తన అద్భుతమైన పెర్ఫామెన్స్ కనబర్చారు.

అలాగే విద్యుత్ కు సహాయక పాత్రగా కనిపించిన అను కపూర్ మంచి నటనకు కనబరిచారు. వీటితో పాటుగా సినిమాలో నిర్మాణ విలువలు కానీ డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు కానీ సూపర్బ్ గా అనిపిస్తాయి. అలాగే సినిమాలోని కొన్ని కీలక సీక్వెన్స్ లకు తగ్గట్టుగా వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.

ఏం బాగోలేదు :

ముఖ్యంగా ఈ సినిమా ప్లాట్ అనేదే చాలా సింపుల్ గా అనిపిస్తుంది. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో ఎన్నో చిత్రాలు లానే ఈ చిత్రాన్ని చూసినప్పుడు కూడా అనిపిస్తుంది. అలాగే సినిమా మెయిన్ స్టోరీలోకి వెళ్ళడానికి కూడా కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నట్టు అనిపిస్తుంది.

వీటితో పాటుగా సినిమాలో కనిపించే ఎమోషన్స్ అంతగా ఇంకా బలంగా సహజంగా ఉంటే బాగుండేది. అంతే కాకుండా కొన్ని లాజిక్స్ కానీ విద్యుత్ ఉన్న మిషన్ లో కానీ కథ నడుస్తన్న కొద్దీ గ్రిప్పింగ్ నరేషన్ లేకుండా సింపుల్ గా కనిపించడం అంత రుచించదు. అలాగే హీరోయిన్ రోల్ కూడా అంత హైలైట్ అవుతూ ఇంపార్టెన్స్ ఇచ్చేలా కనిపించదు.

చివరి మాటగా :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఖుదా హఫీజ్ అనే ఈ చిత్రంలో కేవలం యాక్షన్ పార్ట్ మాత్రమే హైలైట్ అయ్యింది తప్ప మిగతా ఏ అంశాలు కూడా అంతగా ఆకట్టుకోవు. కేవలం యాక్షన్ సీక్వెన్స్ లు ఆకట్టుకుంటాయి తప్పిస్తే మిగతా కథ అంతా చాలా రొటీన్ గా మరియు ముందే ఊహించే విధంగానే అనిపిస్తాయి. ఒకవేళ మీరు కథతో సంబంధం లేకుండా మంచి యాక్షన్ పార్ట్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వారు అయితే ఈ చిత్రాన్ని ఓసారి చూడొచ్చు.

 
Rating: 2.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు