లాక్ డౌన్ రివ్యూ: అన్ దేఖీ- హిందీ సిరీస్(సోనీ లివ్)

లాక్ డౌన్ రివ్యూ: అన్ దేఖీ- హిందీ సిరీస్(సోనీ లివ్)

Published on Jul 16, 2020 3:33 PM IST

తారాగణం: హర్ష్ ఛాయ, దిబియేండు భట్టాచార్య, అభిషేక్ చౌహాన్, సూర్య శర్మ
దర్శకత్వం: ఆశిష్ ఆర్. శుక్లా
నిర్మాతలు: జ్యోతి సాగర్, సిద్ధార్థ్ సేన్‌గుప్తా, అబ్దుల్ అహాద్ నౌషాద్
సంగీతం: అనుజ్ దానైట్, శివం సేన్ గుప్తా
ఛాయాగ్రహణం: ముర్జీ పగ్డివాలా
ఎడిటింగ్: రాజేష్ పాండే

లాక్ డౌన్ రివ్యూస్ సిరీస్ లో భాగంగా నేడు హిందీ సిరీస్ అన్ దేఖీ ని ఎంచుకోవడం జరిగింది. సోనీ లైవ్ లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం…

కథాంశం ఏమిటీ?
ధామన్ అత్వాల్(అంకుర్ రాథీ) పెళ్లివేడుకలో అతని అంకుల్ ఓ డాన్సర్ ని రివాల్వర్ తో కాల్చి చంపేస్తాడు. ఆ పెళ్ళికి ఫోటో గ్రాఫర్ గా వచ్చిన రిషీ(అభిషేక్ చౌహాన్) ఆ మర్డర్ ని అనుకోకుండా తన కెమెరాలో బంధిస్తాడు. రిషీ తన దగ్గర ఉన్న ఆధారాతో పోలీసులకు ఈ మర్డర్ గురించి తెలియజేయాలి అనుకుంటాడు. ప్రమాదక కరమైన ఆ వ్యక్తుల గురించి రిషి పోలీసులకు తెలియాజేశాడా? లేదా? అసలు మర్డర్ విషయంలో తరువాత జరిగిన పరిణామాలు ఏమిటీ? అనేది మిగతా కథ…

ఏమి బాగుంది?

ఈ సిరీస్ లో డి ఎస్ పి రోల్ చేసిన దెబ్యేందు భట్టాచార్య ఈ సిరీస్ కి హైలెట్ అని చెప్పాలి. ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలతో పాటు, గ్యాంగ్స్ ని ఎదిరించే అధికారిగా ఆయన మెప్పించారు. ఇక ఈ సిరీస్ లో నటించిన నటులందరూ అద్భుత నటన కనబరిచారు. నార్త్ ఇండియాలో గన్ కల్చర్, నేర ప్రవృతి గురించి వాస్తవాలకు దగ్గరగా చూపించారు. ప్రతి ఎపిసోడ్ ఆసక్తికర కథనం, అలరించే ముగింపుతో సాగాయి. సిరీస్ సెటప్ మరియు బీజీఎమ్ బాగా కుదిరాయి.

ఏమి బాగోలేదు?

ఇది ఒక సింపులు స్టోరీ. అలాగే అనవసరమైన ఎలివేషన్స్ తో చాలా ఎపిసోడ్స్ వరకు సాగదీశారు. ఎపిసోడ్స్ సంఖ్య తగ్గితే బాగుణ్ణు అనే భావన కలిగింది. తనకు కాబోయే భార్య పాత్రకు ధామన్ కు మధ్య అనవసరమైన సన్నివేశాలతో నిడివి ఎక్కువైపోయింది.

చివరి మాటగా
మొత్తంగా అన్ దేఖీ ఆసక్తికర కథనం,అలరించే సన్నివేశాలతో మెప్పిస్తుంది. ఈ విలేజ్ క్రైమ్ డ్రామాలో ప్రధాన పాత్రల నటన మరో ఆకర్షణ. ఆరు మరియుఏడవ ఎపిసోడ్స్ కొంచెం సాగదీసిన భావన కలిగినా,సిరీస్ మంచి అనుభూతిని అయితే పంచుతుంది. ఈ లాక్ డౌన్ టైం లో ఈ సిరీస్ ఎంజాయ్ చేయవచ్చు.

Rating: 3.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు