కోలీవుడ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం “కూలీ” కూడా ఒకటి. మరి ఇందులో నాగ్ సహా చాలామంది స్టార్స్ కూడా నటిస్తున్నారు. అయితే వారిలో మన టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నట్టు రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగ్ సైమన్ గా నటిస్తుండగా తనపై రీసెంట్ గా ఒక ఊహించని లీక్ బయటకు వచ్చేసి ఒక్కసారిగా వైరల్ అయ్యిపోయింది.
ఇది చూసిన ఆడియెన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు కానీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాత్రం డిజప్పాయింట్ అయ్యాడు. దీనితో ఈ లీక్ పై పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. తమ టీం అందరి రెండు నెలల కష్టం కేవలం ఒక చిన్న లీక్ వల్ల వృథా అయ్యిపోయింది అని నిరాశ వ్యక్తం చేశాడు. దయచేసి తన సినిమాకి ఇలాంటివి చేయొద్దు అంటూ లోకేష్ బతిమాలుకున్నంత పని చేసాడు. దీనితో తన పోస్ట్ వైరల్ గా మారింది.
Two months of hard work by many people have gone in vain because of one recording.
I humbly request everyone not to engage in such practices, as they spoil the overall experience. Thank you.
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) September 18, 2024