పవన్ కి లోకేష్ కనగరాజ్ స్పెషల్ థాంక్స్..

పవన్ కి లోకేష్ కనగరాజ్ స్పెషల్ థాంక్స్..

Published on Oct 3, 2024 11:06 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా కోలీవుడ్ మీడియాకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూ లో పవన్ మాట్లాడిన తమిళ్ చూసి అలాగే తమిళ నేలకి సంబంధించి ఉన్న నాలెడ్జ్ చూసి తమిళ ఆడియెన్స్ షాకయ్యారు. దీనితో కోలీవుడ్ ఆడియెన్స్ లో పవన్ మరింత దగ్గర కాగా అదే ఇంటర్వ్యూలో పవన్ తనకి కోలీవుడ్ లో రీసెంట్ గా నచ్చిన సినిమాలు కోసం చెబుతూ దర్శకుడు లోకేష్ కనగరాజ్ చేసిన “లియో” ఎంతో నచ్చింది అని తన వర్క్ బాగుంది అంటూ పవన్ కొనియాడారు.

దీనితో విజయ్, లోకేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎగ్జైట్ కాగా పవన్ కామెంట్స్ పై లోకేష్ కనగరాజ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసాడు. “మీ నుంచి అలాంటి మాటలు వినడం ఎంతో ఆనందంగా గౌరవంగా ఉంది సర్, నా వర్క్ మీకు నచ్చడం ఎంతో గ్రేట్ గా ఆహ్లదంగా అనిపిస్తుంది. మీకు పెద్ద థాంక్స్ చెబుతున్నాను” అంటూ లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీంతో ఈ పోస్ట్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారిపోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు