తమిళ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఇటీవల లియో మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్నారు. త్వరలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో మంచి యక్షన్ మూవీ తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక మరోవైపు శృతి హాసన్ అడివి శేష్ తో కలిసి డెకాయిట్ మూవీతో పాటు ది చెన్నై స్టోరీ అనే మరొక మూవీ చేస్తున్నారు.
విషయం ఏమిటంటే, శృతి హాసన్ తో కలిసి తొలిసారిగా ఒక సాంగ్ ద్వారా నటుడిగా ఎంట్రీ ఇస్తున్నారు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని తాజాగా ఇనిమెల్ అనే వీడియో సాంగ్ తీశారు. విశేషం ఏంటంటే దీనికి లిరిక్స్ స్వయంగా కమల్ హాసన్ అందిస్తుండడంతో పాటు నిర్మాణం మొత్తం ఆయన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై జరిగింది. కెజిఎఫ్ ఫేమ్ భువన గౌడ ఫోటోగ్రఫి అందించిన ఈ సాంగ్ యొక్క కాన్సెప్ట్, కంపోజింగ్ మొత్తం శృతి హాసన్ చూసుకున్నారు.
ద్వారకేష్ ప్రభాకర్ దర్శకత్వం వహించిన ఈ సాంగ్ ప్రోమో తాజాగా రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సాంగ్ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా శృతి హాసన్ మాట్లాడుతూ మొదట ఈ సాంగ్ విషయం చెప్పగానే లోకేష్ కనకరాజ్ తనతో యాక్ట్ చేయడానికి ఒప్పుకోలేదని, అనంతరం కాన్సెప్ట్ పూర్తిగా వివరించాక చేయడానికి ఒప్పుకున్నారని అన్నారు. నిజానికి తనకు యాక్టర్ కి ఉండే మంచి ఎబిలిటీస్ ఉన్నాయని, దర్శకుడిగా మంచి పేరుతో కొనసాగుతున్న లోకేష్ ఈ సాంగ్ లో బాగా నటించారని అన్నారు శృతి. ఇక ఇనిమెల్ ఫుల్ సాంగ్ మార్చి 25న విడుదల కానుంది.