కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వం లో తెరకెక్కిన లియో చిత్రం వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. సినిమా కి సూపర్ రెస్పాన్స్ రావడంతో డైరెక్టర్ లోకేష్ ఆడియెన్స్ కి థాంక్స్ తెలుపుతున్నారు. అయితే కేరళ కి వెళ్ళిన లోకేష్ కి, అక్కడి ఫ్యాన్స్ నుండి గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మీ ప్రేమకు ధన్యవాదాలు కేరళ, మిమ్మల్ని అందరినీ పాలక్కడ్ లో చూసినందుకు సంతోషం గా ఉంది. గాయం కారణం గా మిగిలిన రెండు వేదికలకు, ప్రెస్ మీట్ కి రాలేక పోయాను. త్వరలో, కేరళలో మిమ్మల్ని అందరినీ కలవడానికి కచ్చితంగా తిరిగి వస్తాను అని అన్నారు.