‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ రిలీజ్ డేట్ అదేనా ?

Published on Sep 19, 2020 3:02 am IST


అఖిల్ అక్కినేని ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈపాటికే పూర్తైపోవాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిడాపడింది. దీంతో కొద్దిపాటి షూటింగ్ మిగిలిపోయింది. పరిస్థితులు నార్మల్ కావడంతో ఇటీవలే హైదారాబాద్లో షూటింగ్ రీస్టార్ట్ చేశారు టీమ్. అఖిల్, పూజా హెగ్డే ఇద్దరూ షూటింగ్లో పాల్గొంటున్నారు. చేయాల్సింది కొద్దిపాటి షూట్ మాత్రమే కావడంతో విడుదలను ప్లాన్ చేస్తున్నారు టీమ్. సన్నిహిత వర్గాల సమాచారం మేరకు సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయడం ఖాయమని అంటున్నారు.

అయితే అది సంక్రాంతి రోజైన 14వ తేదీన లేకపోతే సంక్రాంతి ముందురోజు 13వ తేదీన అనేది తేలాల్సి ఉంది. అఖిల్ సైతం జనవరి 2021లో చిత్రం విడుదల అన్నారు కానీ డేట్ మాత్రం చెప్పలేదు.
అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ ఇద్దరికీ ఈమధ్య కాలంలో బలమైన హిట్ లేకపోవడంతో ఈ సినిమా ఫలితంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ సైతం అఖిల్ ఈ చిత్రంతోనైనా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

More