సైలెంట్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “లవ్ మీ”

సైలెంట్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “లవ్ మీ”

Published on Jun 14, 2024 9:13 AM IST

ఇటీవల మన టాలీవుడ్ నుంచి వచ్చిన పలు మిడ్ రేంజ్ చిత్రాల్లో యంగ్ హీరో ఆశిష్ హీరోగా “బేబి” సెన్సేషన్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా దర్శకుడు అరుణ్ భీమవరపు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ లవ్, హారర్ థ్రిల్లర్ చిత్రం “లవ్ మీ” – ఈఫ్ యూ డేర్. మరి ఆశిష్ కెరీర్ లో మంచి ఓపెనింగ్స్ ని కూడా అందుకుంది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా ఇందులో ఈ సినిమా ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సైలెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ చిత్రం ముందు ఏ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో వస్తుందో రివీల్ చేయలేదు. ఇప్పుడు సడెన్ గా సినిమా ప్రైమ్ వీడియోలో రిలీజ్ కి వచ్చేసింది. మరి ఈ సినిమాని చూడాలి అనుకునేవారు అయితే ప్రైమ్ వీడియోలో ఇప్పుడు చూడవచ్చు. ఇక ఈ చిత్రంకి కీరవాణి సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు.

‘లవ్ మీ’ సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు