సెప్టెంబర్ 27న ‘లవ్ సితార’ ఓటీటీ స్ట్రీమింగ్.. ట్రైలర్ అదిరింది!

సెప్టెంబర్ 27న ‘లవ్ సితార’ ఓటీటీ స్ట్రీమింగ్.. ట్రైలర్ అదిరింది!

Published on Sep 13, 2024 7:38 PM IST

నటి శోభిత ధూళిపాళ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తారనే పేరుంది. ఇక ఆమె నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా మూవీ ‘లవ్ సితార’ నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాలో రాజీవ్ సిద్ధార్థ్ లీడ్ రోల్‌లో నటించారు.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో సెప్టెంబర్ 27 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా, ఇందులో శోభిత ధూళిపాళ ఓ కొత్త పెళ్లి కూతురి పాత్రలో నటిస్తుంది. లవ్, హార్ట్‌బ్రేక్, సెల్ఫ్ డిస్కవరీ అనే కాన్సెప్ట్‌లో ఈ సినిమా కథ సాగుతుందని మేకర్స్ తెలిపారు.

ఈ సినిమాను వందన్ కటారియా డైరెక్ట్ చేశారు. రిజుల్ రే, శంకర్ ఇంద్రఛూడన్, సీమా సాన్వీ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు