సెన్సార్ పూర్తి చేసుకున్న ‘లవ్ స్టోరీ’..!

Published on Sep 15, 2021 1:22 am IST


అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “లవ్ స్టోరీ” చిత్రం ఈ నెల 24వ తేదిన థియేటర్లలో విడుదల కాబోతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, టీజర్, పాటలు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచగా, మొన్న విడుదలైన ట్రైలర్‌కు కూడా భారీ స్పందన లభించింది.

తాజాగా ఈ సినిమా సెన్సార్‌ని పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు కూడా ఈ సినిమాను ప్రశంసిస్తూ ఈ మేరకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమా మొత్తం రన్ టైమ్ వచ్చేసరికి 2 గంటల 25 నిమిషాలుగా ఉన్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి కె నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :