విడుదల తేదీ : ఏప్రిల్ 04, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : స్.పి.చరణ్, శ్రీ హర్ష, కషిక కపూర్, రియా సింగ్, ప్రవీణ్, నవాబ్ షా, భద్రం తదితరులు
దర్శకత్వం : పవన్ కేతరాజు
నిర్మాతలు : కిషోర్ రాఠి, ఏ.సామ్రాజ్యం, ఏ.చేతన్ సాయి రెడ్డి, మహేష్ రాఠీ
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు
ఎడిటర్ : దేవరంపాటి రామకృష్ణ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ప్రముఖ సింగర్ ఎస్.పి.చరణ్ చాలా గ్యాప్ తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చిన మూవీ LYF(లవ్ యువర్ ఫాదర్). ఈ సినిమాలో శ్రీ హర్ష హీరోగా పరిచయం అయ్యాడు. తండ్రీకొడుకుల మధ్య ఎమోషనల్ బాండ్‌ను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఈ LYF(లవ్ యువర్ ఫాదర్) మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
కిషోర్(ఎస్.పి.చరణ్) ఓ సూపర్ మార్కెట్ నడుపుతూ తన కొడుకు సిద్ధు(శ్రీ హర్ష)ని గారాబంగా చూసుకుంటాడు. ఇద్దరి మధ్య స్నేహితుల వంటి బంధం ఉంటుంది. అనాధ శవాలకు అన్నీ తానై దహన సంస్కారాలు చేస్తుంటాడు కిషోర్. తన కాలేజీలో చదువుకునే స్వీటీ(కషిక కపూర్)ని ప్రేమిస్తాడు సిద్ధు. అయితే కొన్ని ఊహించని ఘటన కారణంగా కిషోర్, సిద్ధు ఓ కేసులో ఇరుక్కుంటారు. దీంతో వారు గోవాకు పారిపోతారు. ఇంతకీ వారు ఎలాంటి కేసులో ఇరుక్కున్నారు..? వారిని టార్గెట్ చేసింది ఎవరు..? కిషోర్‌కి సంబంధించి సిద్ధుకి ఎలాంటి షాకింగ్ విషయాలు తెలుస్తాయి..? అనేది ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
తండ్రీకొడుకుల బంధాన్ని మరోసారి ఈ సినిమాలో చక్కగా చూపెట్టారు. ఈ సినిమాలో వారి మధ్య ఉండే ఆప్యాయత ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. తండ్రి పాత్రలో ఎస్.పి.చరణ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కొత్త హీరో అయిన సిద్ధు తన యాక్టింగ్‌తో కొంతమేర మెప్పిస్తాడు. సినిమాలోని ఎమోషనల్ పాయింట్ బాగుంది.
మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఆయన అందించిన బీజీఎం కొన్ని సీన్స్‌ను బాగా ఎలివేట్ చేశాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే సీన్స్‌కు బీజీఎం ప్లస్ పాయింట్. ఇక ఈ సినిమాలోని మెయిన్ పాయింట్ కూడా కొంతమేర ఆకట్టుకుంటుంది.
మధ్యలో వచ్చే ప్రవీణ్, భద్రం, షకలక శంకర్ కామెడీ సీన్స్ కొంతమేర నవ్వులు తెప్పిస్తాయి. క్లైమాక్స్‌లోని యాక్షన్ సీక్వెన్స్ బాగుంది.
మైనస్ పాయింట్స్ :
ఇలాంటి ఎమోషనల్ రివెంజ్ డ్రామాకు నటీనటులు పర్ఫార్మెన్స్‌లతో పాటు కథలోని కోర్ పాయింట్ చాలా ముఖ్యం. కథ రొటీన్ అయినప్పుడు దాని ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. కానీ, ఈ సినిమా ఎగ్జిక్యూషన్‌లో పలు తప్పులు దొర్లినట్లు కనిపిస్తాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే, కథను నెరేట్ చేసే విధానం ఈ సినిమాకు మైనస్ అయ్యాయి.
మంచి ఫీల్ గుడ్ కథకు ఎంటర్‌టైన్‌మెంట్ ముఖ్యమే. కానీ, దాని ప్లేసింగ్ సరిగ్గా ఉండాలి. ఈ సినిమాలో వచ్చే కాలేజీ, లవ్ ట్రాక్, కామెడీ సీన్స్ మిస్ ఫైర్ అయినట్లు కనిపిస్తాయి. కథను సాగదీసేందుకే వీటిని పెట్టినట్లుగా ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ఇక సాంగ్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతాయి. అఘోరాలకు సంబంధించిన ఎపిసోడ్ కూడా ఆకట్టుకోలేకపోతుంది.
హీరో, హీరోయిన్లు కొత్తవారు కావడంతో ఈ సినిమాను ఎస్.పి.చరణ్ తన భుజాలపై వేసుకుని నడిపించారు. కానీ, ఆయన పాత్రను మరింత బలంగా చూపెట్టాల్సింది. ఇక ఆయన పాత్రకు సెకండాఫ్‌లో రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లు చాలా సీన్స్‌లో అనిపిస్తుంది. విలన్ పాత్ర కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపెట్టలేకపోయింది. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌కు మంచి సీన్స్ రాసుకున్నా, వాటిని పూర్తి పర్ఫెక్షన్‌తో చూపెట్టలేకపోయారు.
సాంకేతిక వర్గం :
దర్శకుడు పవన్ కేతరాజు తీసుకున్న కథ రొటీన్ అయినప్పటికీ, దానిలోని ఎమోషన్ బాగుంది. కానీ, కథను ఇంకాస్త పర్ఫెక్షన్‌తో ప్రెజెంట్ చేసి ఉంటే, ఈ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. మణిశర్మ మ్యూజిక్ బాగున్నా, పాటలు పెద్దగా ఆకట్టుకోవు. కానీ, బీజీఎం మాత్రం ఆకట్టుకుంది. ఎడిటింగ్ వర్క్‌కు చాలా పనిపెట్టాల్సింది. చాలా సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. నిర్మాణ విలువలు డీసెంట్‌గా ఉన్నాయి.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే, LYF(లవ్ యువర్ ఫాదర్) మూవీ ఒక రొటీన్ ఎమోషనల్ రివెంజ్ డ్రామాగా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎస్.పి.చరణ్ తన నటనతో ఆకట్టుకుంటాడు. కథలో ఎమోషన్ ఉన్నప్పటికీ, ఈ సినిమా ట్రీట్మెంట్ మిస్ ఫైర్ అయ్యిందని చెప్పాలి. స్లో నెరేషన్, ఆకట్టుకోని స్క్రీన్ ప్లే వంటి అంశాలు ఈ సినిమాకు డ్యామేజ్ చేశాయి. మంచి ఎంటర్‌టైనింగ్ కథలు ఇష్టపడే వారిని ఈ సినిమా మెప్పించకపోవచ్చు.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team