సముద్రాల సినీ క్రియేషన్స్ పతాకంపై బేబీ ఆన్య ఆనంద్ సమర్పణలో ప్రసాద్ ఏలూరి దర్శకత్వంలో చిన్ను క్రిష్, సాయి నాగ్ అట్లూరి, గీతిక రతన్ , మధు ప్రియ , హీరో హీరోయిన్లు గా సముద్రాల మంత్రయ్య బాబు నిర్మిస్తున్న చిత్రం “లవ్ యూ రా”. కమెడియన్స్ గా శేఖర్ బండి , జబర్దస్త్ అప్పారావు , షేకింగ్ శేషు , చిట్టిబాబు , నాగి రెడ్డి , కట్టప్ప ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది.
తాజాగా “లవ్ యూ రా” మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.. ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ప్రేమకథకు కామెడీ థ్రిల్లర్ ని జోడించి దర్శకుడు ప్రసాద్ ఏలూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈశ్వర్ పెరవళి సంగీతాన్ని అందిస్తున్న “లవ్ యూ రా” మ్యూజిక్ శ్రోతలను అలరించే విధంగా పాటల్ని కంపోజ్ చేస్తున్నారు.. రవి బైపల్లి, సుధాకర్ నాయుడు కెమెరా విజువల్స్ సినిమాకి వన్ ఆఫ్ ది హైలెట్ కానున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అతి త్వరలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి