లవ్లీ పిక్ : కాజల్ అగర్వాల్ తో రాశి ఖన్నా

లవ్లీ పిక్ : కాజల్ అగర్వాల్ తో రాశి ఖన్నా

Published on Oct 15, 2023 3:02 AM IST


టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్స్ గా మంచి అవకాశాలతో అలానే విజయాలతో ముందుకు దూసుకెళ్తున్న వారిలో కాజల్ అగర్వాల్, రాశి ఖన్నా కూడా ఉంటారు. ప్రస్తుతం బాలకృష్ణ తో భగవంత్ కేసరి, కమల్ హాసన్ తో ఇండియన్ 2, లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ మూవీస్ చేస్తున్నారు కాజల్. మరోవైపు తమిళ్ లో అరణ్మణై 4, మేథావి, హిందీలో యోధ మూవీస్ చేస్తున్నారు రాశి ఖన్నా.

అయితే మ్యాటర్ ఏమిటంటే, తాజాగా కాజల్ అగర్వాల్ ఇంటికెళ్లి ఆమె ఫ్యామిలీ తో కలిసి సరదాగా గడిపిన పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు రాశి ఖన్నా. ఈరోజుకి చాలా కృతజ్ఞతలు ఎట్టకేలకు తనని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ రాశి ఖన్నా పెట్టిన పోస్ట్ కి, ఇటువంటి లవ్లీ, బ్యూటిఫుల్, డివైన్, పాజిటివ్ అమ్మయిని కలుసుకోవడం సరదాగా గడపడం ఎంతో సంతోషంగా ఉంది రిప్లై ఇచ్చారు కాజల్. కాగా ఆ సందర్భంలో వీరిద్దరూ కలిసి దిగిన లవ్లీ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు