తగ్గిన టికెట్ ధరలు.. వకీల్ మీద గట్టి ఎఫెక్ట్

Published on Apr 13, 2021 10:09 pm IST

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేసిన ‘వకీల్ సాబ్’ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించిన సంగతి తెలిసిందే. తొలిరోజు రూ.30 కోట్ల షేర్ మార్క్ టచ్ చేసిన ఈ సినిమా రెండవ రోజు, మూడవ రోజు కూడ మంచి రన్ అందుకుంది. టికెట్ ధరలు తగ్గించినా కూడ వీకెండ్ కావడంతో వసూళ్లు బాగానే ఉన్నాయి. దీంతో మూడు రోజులకు గాను ఏపీ, తెలంగాణల్లో కలిపి రూ.53.5 కోట్ల షేర్ ఖాతాలో వేసుకుంది సినిమా. ఇక నాల్గవ సోమవారం వర్కింగ్ డే కావడం, తగ్గిన టికెట్ ధరలు వెరసి వసూళ్ల మీద గట్టి ప్రభావమే పడింది.

చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ రన్ లభించినా భారీ కలెక్షన్స్ కనబడలేదు. నైజాంలో 1.12 కోట్లు, సీడెడ్లో 81 లక్షలు, ఉత్తరాంధ్రలో 96 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 31 లక్షలు, వెస్ట్ గోదావరిలో 22 లక్షలు, గుంటూరులో 32 లక్షలు, కృష్ణాలో 31 లక్షలు, నెల్లూరు 14 లక్షలు కలిపి మొత్తంగా 4.19 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అదే ఫస్ట్ వీక్ టికెట్ హైక్స్ గనుక ఉండి ఉంటే ఈ వసూళ్లు మరింత మెరుగ్గా ఉండేవి. ఇక ఈరోజు ఉగాది, రేపు అంబేడ్కర్ జయంతి పబ్లిక్ హాలిడేస్ కావడం సినిమాకు ఊరటనిచ్చే విషయం. ఈ రెండు రోజుల్లో కనీసం 15 కోట్ల వరకు ఖాతాలో వేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :