‘లక్కీ భాస్కర్’ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అయ్యేది ఆ రోజునే!

‘లక్కీ భాస్కర్’ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అయ్యేది ఆ రోజునే!

Published on Jun 13, 2024 2:57 PM IST


మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెక్ట్స్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది.

కాగా, ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను జూన్ 17న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ జివి.ప్రకాశ్ సంగీతం అందిస్తుండటంతో ఈ చిత్రంలోని పాటలు ఎలా ఉండబోతున్నాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, నేడు ప్రకాశ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌పై అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు