సమీక్ష : “లక్కీ భాస్కర్” – పైసా వసూల్ ఎంటర్టైనర్

సమీక్ష : “లక్కీ భాస్కర్” – పైసా వసూల్ ఎంటర్టైనర్

Published on Nov 1, 2024 3:06 AM IST
Lucky Baskhar Movie Review in Telugu

విడుదల తేదీ : అక్టోబర్ 31, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, రిత్విక్, సాయి కుమార్, టిన్ను ఆనంద్, రాంకీ తదితరులు

దర్శకుడు : వెంకీ అట్లూరి

నిర్మాతలు : సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్

సంగీత దర్శకుడు : జీవి ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ : నిమిష్ రవి

ఎడిటర్ : నవీన్ నూలి

సంబంధిత లింక్స్: ట్రైలర్


ఈ వారం థియేటర్స్ లోకి పండుగ ముందే వచ్చేసింది అని చెప్పాలి. దీపావళికి ఓ రోజు ముందే పలు సినిమాలు థియేటర్స్ లో సందడి చేయగా ఆ సినిమాల్లో దుల్కర్ సల్మాన్ అలాగే వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన సినిమా “లక్కీ భాస్కర్” కూడా ఒకటి. మరి మంచి ఆసక్తి రేపిన ఈ సినిమా అంచనాలు అందుకుందో లేదో సమీక్షలో చూద్ధాం రండి.

కథ:

ఇక కథలోకి వస్తే.. 1990 దశకంలో సెట్ చేయబడిన ఈ కథలో భాస్కర్(దుల్కర్ సల్మాన్) ముంబైలో మగధ బ్యాంక్ లో ఓ చిన్నపాటి క్యాషియర్ గా పని చేస్తాడు. తన చాలీ చాలని జీతంతో తన భార్య(మీనాక్షి చౌదరి) తన కుటుంబాన్ని చాలా కష్టంగా నెట్టుకొస్తాడు. తన కుటుంబం కోసం ఎంతవరకు అయినా వెళ్లగలిగే భాస్కర్ కి డబ్బు సంపాదించడం అనేది ఒక అవసరం నుంచి వ్యసనంగా ఎలా మారింది? ఈ క్రమంలో తను చేసిన మైండ్ గేమ్ ఏ రేంజ్ లో ఉంది? డబ్బు వల్ల తను నష్టపోయాడా? లాభ పడ్డాడా అనే లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

పర్టిక్యులర్ గా చిత్ర యూనిట్ అంతా ఈ సినిమా విషయంలో అంత బలమైన నమ్మకంతో ఎందుకు ఉన్నారో క్లియర్ గా ఈ సినిమా చూస్తే అర్ధం అయ్యిపోతుంది. మెయిన్ గా సినిమాలో దుల్కర్ సల్మాన్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. తన నటన కోసం పక్కన పెడితే తన పాత్రని తీర్చి దిద్దిన విధానం పెద్ద హైలైట్ అని చెప్పాలి.

సినిమా మొదలు నుంచి చివరి వరకు దుల్కర్ సల్మాన్ రోల్ ఆడియెన్స్ ని సినిమాలో అలా మిళితం అయ్యేలా లీనం చేసేస్తుంది. మరి తన రోల్ ని కూడా దుల్కర్ అదే రేంజ్ లో పండించాడు. సాధారణ మిడిల్ క్లాస్ బ్యాంక్ ఎంప్లాయి ఎంత నెమ్మదిగా కనిపిస్తాడో అక్కడ నుంచి బాగా డబ్బులొచ్చాక అందులో గ్రే షేడ్స్ ని దుల్కర్ అయితే అదరగొట్టడాని చెప్పాల్సిందే.

అలాగే సినిమా కూడా ఒక కిందకి పడని స్టాక్ మార్కెట్ గ్రాఫ్ లా అలా కింద నుంచి పైకే కొనసాగుతుంది. ఇక దుల్కర్ సహా మీనాక్షి తన రోల్ లో బాగా చేసింది. చాలా సినిమాలు తర్వాత తనకిది మంచి రోల్ అని చెప్పొచ్చు. అలాగే నటుడు రాంకీ, టిన్ను ఆనంద్, సాయి కుమార్, రిత్విక్ ఇంకా ఇతర ముఖ్య నటులు సినిమాలో తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

అలాగే సినిమాల్ కొన్ని ఊహించని ట్విస్ట్ లు అయితే ఫస్టాఫ్ సెకండాఫ్ ఇంకా క్లైమాక్స్ లలో మంచి హై ని కూడా అందిస్తాయి అని చెప్పాలి. ఇక వీటితో పాటుగా దుల్కర్ సల్మాన్ పాత్ర చేసే మైండ్ గేమ్స్, తన రోల్ పై చూపించే టెన్స్ సీన్స్ మంచి ఉత్సుకతని తీసుకొస్తాయి. ఇంకా ముఖ్యంగా దర్శకుడు టేకింగ్ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా సినిమాలో దుల్కర్ తన ఫ్యామిలీ నడుమ సీన్స్ బాగా వర్కౌట్ అవుతాయి.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో నేపథ్యం ఏమీ కొత్తదేమి కాదు అందరికీ బాగా తెలిసిందే కనిపిస్తుంది. అలాగే ట్రీట్మెంట్ కూడా కొంచెం రొటీన్ గానే అనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో దుల్కర్ రోల్ ఆల్మోస్ట్ దొరికేసింది అనుకునే సమయంలో దానికి ముందే ఓ సీన్ ని దాచి ఉంచడం తర్వాత రివీల్ చేయడం వంటివి ఆల్రెడీ చూసినట్టు గానే అనిపిస్తాయి.

ఇంకా ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ ఇది వరకే చూసినట్టు అనిపిస్తాయి. అలాగే సినిమాలో డబ్బు, షేర్ మార్కెట్ వంటి కోణాలు కూడా చూపించబడ్డాయి కొన్ని బ్యాంక్ రిలేటెడ్ స్కామ్ సీన్స్ చూస్తే స్కామ్ 1992 సిరీస్ షేడ్స్ కనిపిస్తాయి. కొంతమందికి ఆ సిరీస్ కూడా గుర్తుకురావచ్చు.

సాంకేతిక విభాగం:

డబ్బు ప్రధాన ఎలిమెంట్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో మేకర్స్ పెట్టిన ప్రతి రూపాయి కనిపిస్తుంది. మెయిన్ గా వింటేజ్ సెటప్ ని అంతా చాలా బాగా చూపించారు. ఆ సెట్టింగ్స్ అంతా చాలా నాచురల్ గా ఉన్నాయి. అలాగే సినిమాలో ప్రతీ నటీనటులు వేషధారణ అప్పటి సామగ్రి విషయంలో దర్శకుడు విజన్, ఆర్ట్ రంగం జాగ్రత్తలు కనిపిస్తాయి. అలాగే సినిమాటోగ్రఫి పర్ఫెక్ట్ గా ఉంది. ఇంకా ఎడిటింగ్ కూడా నీట్ గా ఉంది. మెయిన్ గా జీవి ప్రకాష్ మ్యూజిక్ సాలిడ్ లెవెల్లో పలు సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. డైలాగ్స్ కూడా బాగున్నాయి.

ఇక దర్శకుడు వెంకీ అట్లూరి విషయానికి వస్తే.. వెంకీ సార్ సినిమా నుంచి మార్చిన పంథా ఇపుడు లక్కీ భాస్కర్ తో మరింత స్ట్రాంగ్ గా మార్చుకున్నాడు అని చెప్పొచ్చు. ఈ సినిమాకి తను చూపించిన బ్రిలియెన్స్ తప్పకుండా ఇంప్రెస్ చేస్తుంది. సినిమాలో ట్విస్ట్ లు ప్రతీ పాత్ర డిజైన్ ని వెంకీ నీట్ గా చాలా క్లారిటీగా డిజైన్ చేసుకున్నాడు. అలాగే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి తన కుటుంబం కంటే ఇంకేది ఎక్కువ కాదు అని ప్రెజెంట్ చేసిన పాయింట్ బాగుంది. దీనితో దర్శకునిగా ఈ సినిమా తన కెరీర్ లో బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “లక్కీ భాస్కర్” అనుకున్న అంచనాలు తప్పకుండా రీచ్ అవుతాడు. సినిమాకి ఉన్న బజ్ ట్రైలర్ చూసి పెరిగిన ఆసక్తికి చాలా రెట్లు బెటర్ గా ఈ సినిమా అనిపిస్తుంది. మెయిన్ గా ఇది దర్శకుడు, హీరో దుల్కర్ సల్మాన్ ల స్టీలింగ్ షో అని చెప్పొచ్చు. మంచి ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్, ఎమోషన్స్, కామెడీ, సస్పెన్స్ ఫ్యాక్టర్ లు అన్ని చాలా బాగున్నాయి. ఈ దీపావళికి అయితే లక్కీ భాస్కర్ పై వేసిన బెట్ తప్పకుండా గెలిచి తీరుతారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు