“లక్కీ భాస్కర్” ప్రీరిలీజ్ ఈవెంట్ తేదీ, వేదిక ఖరారు

ఈ దీపావళి కానుకగా మన టాలీవుడ్ నుంచి రాబోతున్న చిత్రాల్లో టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన బ్యాంగర్ చిత్రం “లక్కీ భాస్కర్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ట్రైలర్ తో ఒక్కసారిగా మంచి ని తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ఓ పక్క జోరుగా కూడా జరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాపై మేకర్స్ ఇపుడు సాలిడ్ అప్డేట్ ని అందించారు.

ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ అక్టోబర్ 27న చేస్తున్నట్టుగా డేట్ ని రివీల్ చేశారు. అలాగే హైదరాబాద్, ఫిలిం నగర్ జే ఆర్ సి కన్వెషన్ వేదికగా అయితే ఈ ఈవెంట్ జరగనున్నట్టుగా తెలిపారు. మరి ఈ ఈవెంట్ కి అతిధులుగా ఎవరు వస్తారు అనేది ఇంకా బయటకి రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ అక్టోబర్ 31న సినిమా తెలుగు తమిళ్ సహా మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది.

Exit mobile version