నెట్‌ఫ్లిక్స్‌లో ‘లక్కీ భాస్కర్’ రేర్ ఫీట్

నెట్‌ఫ్లిక్స్‌లో ‘లక్కీ భాస్కర్’ రేర్ ఫీట్

Published on Feb 26, 2025 9:00 PM IST

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ మూవీగా నిలిచింది. దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అదిరిపోయే స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపింది.

ఇక ఈ సినిమా ఓటీటీలోనూ సాలిడ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో 13 వారాలుగా వరుసగా ట్రెండింగ్‌లో కొనసాగుతుందని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఇలా వరుసగా 13 వారాల పాటు ట్రెండ్ అవుతున్న తొలి సౌత్ ఇండియన్ చిత్రం ‘లక్కీ భాస్కర్’ అని మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు